లైఫ్ స్టైల్: వేసవిలో ఈ పదార్థాలకు దూరంగా ఉండాల్సిందే..!!

Divya
మార్చి నెల సీజన్ పూర్తిగా అయిపోతుంది కాబట్టి మండే ఎండలు ఎక్కువ అవుతున్నాయి. అందుకే ఈ ఎండాకాలంలో కొన్ని వేడిని కలిగించే ఆహార పదార్ధాలను దూరంగా ఉంచాలి. ఈ కాలంలో కొన్ని రకాల పదార్థాలకు తప్పకుండా దూరంగా వుండాలి అని వైద్యులు సైతం హెచ్చరిస్తున్నారు. ఈ వేసవి కాలంలో దూరం పెట్టాల్సిన ఆ ఆహార పదార్థాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
1. కాఫీ లేదా టీ:
శీతాకాలంలో ఒక కప్పు టీ లేదా కాఫీ తీసుకున్నప్పుడు మన శరీరానికి చాలా హాయిగా ఉంటుంది . ఎందుకంటే బయట వాతావరణం మారుతూ ఉంటే మన శరీరంలో మార్పులు కూడా సంభవిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మన శరీరానికి అవసరమైన మార్పులు కూడా చోటుచేసుకుంటాయి. కాఫీ లేదా  టీ  శీతాకాలంలో తాగవచ్చు కానీ వేసవి కాలంలో మాత్రం పూర్తిగా దూరంగా ఉండాలి .. లేకపోతే ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు ఎక్కువగా ఏర్పడతాయి . అంతేకానీ నిద్రలేమి సమస్య కూడా వస్తుంది.
2. నూనె ఆహారాలు:
ఇకపోతే శరీరంలో నూనె ఆహారాలను త్వరగా జీర్ణం చేసుకోలేదు.  కాబట్టి వాతావరణం మారినప్పుడు కూడా ఈ ప్రభావం పడుతుంది. అందుకే వేసవి కాలంలో నూనె పదార్థాలు తీసుకుంటే శరీరం పై ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శరీరాన్ని చల్లగా ఉంచాలని తప్పకుండా తీసుకోవాలి. అందులో ఆయిల్ ఫుడ్ లేకుండా జీర్ణమయ్యే ఆహార ధాన్యాలను తీసుకోవచ్చు.
3. అల్లం:
టీ లేదా మసాలా కలిపిన ఆహార రకాలు ముఖ్యంగా శీతాకాలంలో అల్లాన్ని తక్కువగా వినియోగిస్తారు. ముఖ్యంగా వేసవికాలంలో అల్లం తీసుకోవడం వల్ల శరీరంలో వేడి పెరిగి గుండెల్లో దడ పుడుతుంది.
4. ఉల్లిపాయలు:
వేసవికాలం వచ్చేటప్పుడు ఉల్లిపాయలకు దూరంగా ఉండాలి. ఉల్లిపాయలలో సహజసిద్ధంగా నీటి శాతం అధికంగా  ఉండడం వల్ల శరీరానికి మంచి కలిగించినా.. వేసవికాలంలో తీసుకోవడం వల్ల కడుపు నొప్పి అధికంగా వస్తుంది. సాధ్యమైనంత వరకు వేసవి కాలంలో ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: