కొత్త సంవత్సరం ఈ 3 వస్తువులను ఇంట్లో ఉంచకండి

VAMSI
కొత్త సంవత్సరం ఎంతో ఉత్సాహంగా మన జీవితంలోకి వచ్చేసింది. ఈ సంవత్సరం అందరికీ బాగా కలిసి రావాలని అనుకుని నిన్నటి నుండి కొత్త ఏడాదిని ప్రారంభించాము. అయితే చాలా మంది ఎలా ఆలోచిస్తారు అంటే...కొత్త సంవత్సరంలో కొత్త కొత్తగా ఆలోచించాలి.... ఇంట్లో ఉన్న వస్తువులలో అన్నీ కూడా కొత్తవి ఉండాలి. పాతవాటిని వదిలించుకోవాలి అంటూ ఆలోచిస్తూ ఉంటారు. కానీ మనకు కొందరు జ్యోతిష్య శాస్త్రజ్ఞులు ఇంటిలో ఉన్న కొన్ని పాత వస్తువులను తొలగించుకుంటే అంతా మంచి జరుగుతుందని చెబుతున్నారు. మరి ఆ వస్తువులు ఏమిటో? అనే పూర్తి వివరాలు తెలుసుకుందామా...
1. పాత సోఫా
మనము చాలా కాలంగా సోఫాను కొని ఉంటాము. అప్పటికే అది బాగా పాతబడి ఉంటుంది. కొన్ని సార్లు రిపేర్లు కూడా చేసి ఉంటాము. అలాంటప్పుడు ఇక మీ ఇంట్లో కొత్త సంవత్సరం ఆ సోఫాను తీసి వేయడమే మంచిది. ఒకవేళ పారేయడం ఇష్టం లేకుంటే మీ బంధువులకు లేదా పక్కన ఇంటి వారికి ఇచ్చేసి కొత్తది తీసుకుంటే ఇంటికి కళ వస్తుంది.
2. పాత బట్టలు మరియు పుస్తకాలు
మనము ఒక సంవత్సర కాలంలో పండుగలు కని, పుట్టిన రోజుకు అని, లేదా వివిధ ఫంక్షన్ లకని కొత్త బట్టలు కొంటూనే ఉంటాము. దాని వల్ల ఏడాది చివరకు వచ్చే సరికి మీ ఇంటిలో పాత బట్టలు ఎక్కువగా ఉండిపోతాయి. అయితే వీటిలో కొన్ని బట్టలు వాడకుండా అలాగే బీరువాలో భద్రపరిచి ఉంటారు. ఇలాంటి వాటిని అనాధ లేదా పేద వారికి పంచి పెట్టండి.
ఇక పుస్తకాల గురించి వేరే చెప్పక్కర్లేదు. ఎప్పుడో మీరు చదివిన నాటి నుండి  నేటి మీ పిల్లల చదువు వరకు వివిధ తరగతులకు సంబంధించిన పాత పుస్తకాలు అలానే ఉండిపోతాయి. చదువుకునే పుస్తకాలను పడేయకూడదు మరియు అమ్మకూడదు అనే సెంటిమెంట్ తో అలానే చాలా కాలం పాటు ఉంచేస్తారు. ఇలా మిగిలిన పుస్తకాలను అవసరం ఉన్న వారికి ఇచ్చేస్తే భారం తగ్గి సంతోషంగా ఉంటుంది.
3. షూ ర్యాక్ క్లీనింగ్
దాదాపుగా ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో షూ ర్యాక్ ఉండనే ఉంటుంది. ఇందులో మనము రెగ్యులర్ గా వాడే చెప్పులు మరియు షూ మాత్రమే కాకుండా పాత చెప్పులు షూ కూడా అలాగే వదిలేస్తూ ఉంటారు.  అయితే ఇంటికి ముందు ఇలా దుమ్ము పట్టిన చెప్పులు వాటిని ఉంచడం అంత మంచిది కాదు. కాబట్టి మీరు వాడేవి మినహాయిస్తే మిగిలినవి పడేయడమా లేదా ఎవరికైనా ఇచ్చి వేయడమా చేయండి.
ఈ మూడు విషయాలు గుర్తుంచుకుని క్లీన్ చేసుకుంటే ఈ సంవత్సరం అంతా మంచి జరుగుతుందని నమ్ముతారు...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: