హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2021: కొత్త సంవత్సరానికి ఇలా వెల్కమ్ చెబుదామా..!

MOHAN BABU
సమాజంలోని రుగ్మతలు అసమానతలు అంతరాలు వర్గ దృక్పథాన్ని  ముల్లె విప్పినట్టు విప్పి బహిర్గతం చేసిన ప్రముఖ విప్లవ కవి శ్రీ శ్రీ" సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలకు కారణాల తో సహా రోగ నిర్ధారణ చేశానని ఇక రోగాన్ని నయం చేసుకొని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం చేయడానికి మందులతో నయం చేసుకుంటారో శస్త్రచికిత్స చేస్తారో ఇక మీ ఇష్టం" అని యువతకు సమాజానికి ప్రజలకు సమస్య ముందుంచడం జరిగింది. ఆ ప్రయత్నం అంతా వారి యొక్క మహాప్రస్థానం కవిత్వం ద్వారా తెలిపి తన సామాజిక బాధ్యతను చాటుకున్నాడు . ఇవాళ మనం ఎవరికీ వాళ్ళమే మన లోపాలు, లొసుగులను, స్వార్థాన్ని, బాధ్యతా రాహిత్యాన్ని, అసహనం, ఆవేశం, మనిషిని మనిషిగా గుర్తించనటువంటి ఆమానవీయ సంస్కృతిని ప్రక్షాళన చేసుకోవలసిన అవసరం ఉంది. మనిషి ఎందుకు మాయం అవుతున్నాడు..? అదే సందర్భంలో మనిషి ఎందుకు ఆగం అవుతున్నాడు..? అనే ప్రశ్నలు కనుక మనం వేసుకుంటే ప్రక్షాళన తో పాటు ఈ సమాజం పూర్తిగా సంస్కరించబడే ఆస్కారం ఉంది. మానవతా విలువల పునాదిగా ,మానవ సంబంధాలను బలోపేతం చేసే క్రమంలో, కుటుంబ బంధాలను కాపాడుకునే బాధ్యత గా, నిబద్ధత, పట్టుదలతో కొత్త మానవున్ని నిర్మాణం చేయవచ్చు.


      అందుకు ఇంకా ఏం చేయాలి: అందరూ ఈ సమాజం భ్రష్టు పట్టి పోతున్నదని పదేపదే చెబుతున్నప్పుడు ఒక పరిష్కారాన్ని కూడా తరచుగా చెబుతుంటారు .అదే పాఠశాలల్లో నైతిక విద్యను  హెచ్చు స్థాయిలో ప్రారంభించడం ద్వారా బాల్యంలోనే సరైన బీజం వేయవచ్చు అని వారి వాదన. ఇది నిజంగా అర్థవంతమైన సూచనే. సమాజానికి ప్రతిబింబ మైనటువంటి పాఠశాల లేదా విద్యాసంస్థలో  స్నాతకోత్తర స్థాయి వరకు కూడా చరిత్ర, సంస్కృతి ,నైతికత, శ్రమైక జీవనం వంటి అంశాలు పునాదిగా ప్రత్యేకమైనటువంటి సిలబస్ను ప్రవేశ పెట్టడం ద్వారా మెరుగైన ఫలితాలను పొందవచ్చు .ఉత్తమ సమాజాన్ని నిర్మించవచ్చు .వ్యక్తి నిర్మాణం ద్వారా సమాజ నిర్మాణం జరగడానికి పాఠశాల అనుకూలమైన వేదికే కదా!
టీవీ ప్రసారాలు, సినిమా సంస్కృతి, మద్యపాన దురలవాటు, ధూమపానం, అశ్లీల సంస్కృతి చిత్రాలు, హింసను దోపిడీని అమానవీయత ను ప్రదర్శించే సన్నివేశాలు దృశ్యాలు నేటి సామాజిక రుగ్మతలకు ప్రధాన కారణం కాదా? అటు ప్రభుత్వాలు ,విద్యాసంస్థలు, బుద్ధిజీవులు, మేధావివర్గం, ప్రజాసంఘాలు, రాజకీయ పక్షాలు ఎందుకు ఆలోచించడం లేదు? ఏ వర్గానికి ఆ వర్గం ప్రత్యేకమైన లబ్ధిని ముందుంచుకుని పనిచేయడం వల్ల ఏకాభిప్రాయాన్ని సాధించలేక సమాజాన్ని మరింత ఉన్నతంగా చూడలేక పోతున్నాము.


       సినిమా టిక్కెట్ల ధరల కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడుతూ అనుమతులు లేకుండా అక్రమంగా ప్రదర్శిస్తున్న సినిమా థియేటర్లు మూసివేస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సినిమా పరిశ్రమ మెప్పు పొందడానికి టిక్కెట్ల ధరలు పెంచడానికి అనుమతిస్తూ టీవీ సినిమా ప్రసారాల మీద ఎలాంటి నిఘా లేకుండా అనుమతించడం నీచమైన సమాజానికి వెన్నుదన్నుగా నిలవడమే కదా యువత ,కార్మిక కర్షకులు ,ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు, ఉపాధ్యాయ లోకం, సీనియర్ సిటిజన్ లు ప్రధానంగా ముందు వరుసలో నిలబడి  తప్పుడు విధానాలకు కళ్ళెం వేస్తూ అర్థవంతమైన ఆచరణ ద్వారా నీతి బాహ్యమైన విధానాల మీద ఉక్కు పాదం మోపితే, తల్లిదండ్రులు పిల్లల పెంపకం పైన శ్రద్ధతో విప్లవాత్మక మార్పులను తీసుకు వస్తే సమాజం ప్రక్షాళన జరుగుతుంది. మెరుగైన సమాజం, సమ సమాజం, అసమానతలు అంతరాలు లేనటువంటి మహోన్నత సమాజం ఆవిష్కృత మవుతుంది. ఆర్థిక అంతరాలు ప్రధానమైన కారణంగా ఉన్నప్పటికీ కుల పరమైన టువంటి సామాజిక రుగ్మతలను, ఆర్థిక అసమానతలను సమాంతరంగా రూపుమాపడానికి అటు ప్రభుత్వము రాజకీయ పక్షాలు ఇటు విద్యా సంస్థలు పౌర సమాజం ఉమ్మడిగా కలిసి పనిచేయడమే కొంతయినా చీకట్లో చిరుదివ్వెలు వెలిగించడానికి ఆస్కారముందని సమాజం ఆశిస్తున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: