తగ్గేదేలే:మహిళలకే ఆదర్శం.. ఈమె ధైర్యం..ఏం చేసిందంటే..!

MOHAN BABU
మహిళలు ఒకప్పుడు కొన్ని రంగాలకే పరిమితం కాగా,ఇప్పుడు తగ్గేదేలా అన్నట్టు అన్ని పనుల్లోనూ తమదైన ప్రతిభ చాటుతున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడులోని విల్లుపురానికి చెందిన 43 ఏళ్ల చిత్ర 22 ఏళ్లుగా ఆటోడ్రైవర్ గా రాణి స్తోంది.రెండు దశాబ్దాలుగా ఎన్నో అవమానాలు, సమాజ వివక్షతను తట్టుకొని నిలబడి.. ఎందరో మహిళలకు స్పూర్తిగా నిలుస్తోంది.కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి 1999లో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ అందించడం ప్రారంభించింది. ఆ సమయంలో 21 ఏళ్ల చిత్ర ఆటోరిక్షా స్టీరింగ్ పట్టుకోగా.. తిరుగులేని ఆటోడ్రైవర్ గా ప్రశంసలు అందు కుంటోంది. ఈ ప్రయాణంలో పట్టణానికి చెందిన ఎంతోమంది ప్రేమాభి మానాలు సంపా దించుకున్న ఆమె..

 ప్రభుత్వ అధి కారులు, న్యాయ వాదులు, విద్యార్థులను విశ్వసనీయమైన కస్టమర్స్ గా మార్చుకుంది. అయితే ఈ రోజుల్లో కూడా ఓ మహిళ ఆటో నడుపుతున్న తీరును చూసి జనాలు షాక్ కావడాన్ని జీర్ణించలేక పోతుంది చిత్ర. జెండర్ కార ణంగా ప్రయాణికులు తన డ్రైవింగ్ నైపుణ్యాలను తక్కువ అంచనా వేసిన సందర్భాలు ఉండగా.. ఆ జాబితాలో పోలీసులు కూడా ఉన్నారని తెలిపింది.లింగవివక్ష కూడా రేట్లపై ప్రభావాన్ని చూపుతోందని మేల్ డ్రైవర్ కు చెల్లించే దానికంటే తమ రైడ్ కు చాలా తక్కువ చెల్లిస్తారని వివరించింది. కొందరు పురుషులు వెటకారంగా మాట్లాడటంతో పాటు ఆటో ఎక్కేందుకే ఆలోచిస్తుంటారని..

 కానీ మహిళా ప్రయాణికులు మాత్రం తన రైడ్ ను సురక్షితంగా భావిస్తారని తెలిపింది. సాధారణ రోజుల్లో రోజుకు 300 నుంచి 400 ఆదాయం వస్తే,పండగ సమయంలో అంతకు రెండు, మూడు రెట్లు ఎక్కువగా సంపాదిస్తానని చెప్పింది. మహిళా కస్టమర్స్ కు అవసరమైతే అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటానని చెప్పింది. మహిళలు పురుషులతో సమానంగా శక్తివంతులని అభిప్రాయపడిన చిత్ర.. ఆటో రిక్షా నుంచి బరువైన వస్తువులను లోడ్,అన్లోడ్ చేసే విషయంలోనూ పురుషుల సహాయాన్ని నిరాకరిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: