టూర్ల కోసం.. ముందస్తు సెర్చ్..!

ప్రపంచం చుట్టాలని ఎవరికి మాత్రం ఉండదు, అది కూడా ఒక్కో ప్రాంతం అందాలు ఒక్కో ఋతువులో ఒకొరకంగా మారిపోతూ ఆకర్షిస్తూ ఉంటాయి. అందుకే చాలా మంది కాస్త వెసులుబాటు దొరికితే వెంటనే ఏదో ఒక పర్యాటక ప్రాంతానికి చెక్కేస్తూ ఉంటారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న వాళ్లకు వారాంతపు సెలవలు చాలు, ఆ రెండు రోజులలో విహారయాత్రలు చేస్తూనే ఉంటారు. ఇలాంటి వారిని ఒక్కచోట ఉండమంటే అసలు ఉండలేరు సరికదా మానసికంగా కొత్త సమస్యలు వచ్చిపడతాయి కూడా. వైద్యంలో కూడా మనసు గాయమైనప్పుడు విహారయాత్రలు చేస్తూ, ఉన్న ప్రాంతాన్ని కొన్ని రోజులు దూరంగా వెళ్ళడానికి ప్రయత్నించామని సలహాలు కూడా ఇస్తుండటం తెలిసిందే. అంటే కాస్త మానసిక ఉల్లాసం కోసం అప్పుడప్పుడు విహారయాత్రలు చాలా అవసరం. అందుకే గతంలో లేవు కానీ, ఇప్పుడు అయితే దానికోసం ప్రత్యేకంగా ఎన్నో పర్యాటక పధకాలు అటు ప్రభుత్వం ఇటు ప్రైవేట్ రంగాలలో అందుబాటులో ఉన్నాయి.
కొన్ని దేశాలు ఈ పర్యాటక రంగం పైనే ఆధారపడి బ్రతికేస్తున్నాయని అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అక్కడ ప్రభుత్వం అంత గొప్పగా ఆయా ప్రాంతాలను ఆకర్షణీయంగా తయారుచేసి, పర్యాటకులకు ఆహ్వానం పలుకుతుంది. దేశవిదేశాలలో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఇలాంటివాటిని నిత్యం పర్యటించే వాళ్లకు కరోనా పెను ప్రమాదం తెచ్చిపెట్టిందని చెప్పాలి. ఒక్కసారి అది వచ్చాక, లాక్ డౌన్ విధించాల్సి వచ్చింది. ఉన్న చోట ఉండలేని పర్యాటకులు కరోనా సమయంలో ఒక చోటే అది కూడా ఇంట్లో నే ఉండాలి అంటే ఎంత కష్టపడి ఉంటారో అర్ధం చేసుకోవచ్చు. ఇందులో కొందరు లాక్ డౌన్ అవగానే మళ్ళీ పంజరంలో చిలక లాగా ఎటైనా ఎగిరిపోవాలి అని ముందస్తు ప్రణాళికలు కూడా వేసుకున్నారు.
అందులో బాగంగానే ఏఏ ప్రాంతాలు ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి అనేది బాగా తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేశారు.  దానిపై తాజాగా నివేదిక వచ్చింది. ఈ జాబితాలో ఇజ్రాయెల్ లోని తెల్లవిస్, ప్యారిస్, సింగపూర్, జ్యురిచ్, హాంగ్ కాంగ్, న్యూయార్క్ సిటీ, జెనీవా, కోపెన్ హెగెన్, లాస్ ఏంజిల్స్, ఒసాకా, సిరియా కు చెందిన డమాస్కస్ లు అత్యంత ఖరీదైన ప్రాంతాల నుండి అతి తక్కువ ఖరీదైన ప్రాంతాల రాకింగ్ ఇది. అంటే పర్యటనకు ఏవేవి తమ బడ్జెట్ లో ఉన్నాయో చూసుకుంటున్నారన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: