బాల భార‌తం : అమ్మ‌నాన్న‌ల‌కు వంద‌నాలు చెల్లించావా?

RATNA KISHORE
ఇల్లు ఇండిపెండెంట్  
జీవితం కూడా ఇండిపెండెంటేనా
ఊహూ కాదు.. ఎవ‌రో ఒక‌రి ఆస‌రా కావాలి
కానీ బిడ్డ‌ల‌కు మాత్రం
తమ ఆస‌రా కోరే అమ్మా నాన్నా
వ‌ద్దు గాక వ‌ద్దు
అందుకే వ‌యసొచ్చాక
త‌ల్లీ తండ్రీ కూడా ఎక్క‌డో ఓ చోట ఉండిపోవాలి
ఉద‌యం నీ క‌ష్టం రాత్రి నీ దుఃఖం  వారికి తెలిసినా
ఇప్ప‌టి రోజుల్లో ఏమీ చేయ‌లేరు ఎందుకంటే
వాళ్లెవ్వ‌రూ నీ ద‌గ్గ‌ర ఉండ‌రు క‌నుక
హ్యాపీ మార్నింగ్.. లేచీ లేవంగానే అమ్మానాన్న‌లే  ఎదురువ‌స్తారు. బ‌డికి వెళ్లే వేళ ఆట‌ల్లో మునిగి కాలం తెలియ‌నివేళ అన్నింటా అమ్మా నాన్నే గుర్తుకు వ‌స్తారు. త‌ల్లీ తండ్రీ దైవం అని భావించిన బిడ్డ‌లు ఇప్పుడు లేరు. అసలు అలాంటివి ఇవాళ  మీరు కోరుకోవ‌ద్దు. అస‌లు అలాంటివి ఆధునిక కాలంలో చెల్లుబాటు కావు. ఉద‌యం లేవంగానే ఆన్లైన్ వ్యాలెట్ లో డ‌బ్బులున్నాయా లేవా .. అలా ఉంచ‌క‌పోతే నాన్న మీద అరిచే కుర్రాడు, అమ్మ మీద అరిచే చిన్న‌ది ఉంటారే త‌ప్ప వారికి ఇంకేం ప‌ట్ట‌వు. బిడ్డ‌లు మీ క‌ల‌ల‌కు ప్ర‌తినిధులు అని ఎవ్వ‌ర‌న్నా  ఇప్పుడు మాత్రం అలాంటివి ఒప్పుకోకండి. ఎవ్వ‌రూ ఎవ్వ‌రికీ ప్ర‌తినిధిగా ఉండ‌రు. ఇక్క‌డ మీరు జ‌న్మ‌నిచ్చారు క‌నుక‌నే అనుభ‌వించాలి. మీరు జ‌న్మ‌నిచ్చారు క‌నుక‌నే ఆన్లైన్ అప్పులు చూడాలి. క్లియ‌ర్ చేయాలి. అన్నీ స‌మ‌కూర్చాక త‌ప్పుకోవాలి. లేదంటే మీరు మంచి పేరెంట్స్ కాదు. మీకు అస్స‌లు పిల్ల‌ల పెంప‌క‌మే చేత‌గాదు.
ఆస్తుల పంపకం ఒక్క‌టే మంచి పేరెంటింగ్ కు ల‌క్ష‌ణం. అంత‌ర్జాతీయ బ‌డుల్లో చ‌దివిండ‌చ‌మే మంచి పేరెంటింగ్ కు ల‌క్ష‌ణం. మీరు తిన్నా తిన‌క పోయినా పిల్ల‌ల గొంతెమ్మ‌కోరిక‌లు తీర్చ‌డ‌మే ఇప్ప‌టి గుడ్ పేరెంటింగ్ క్వాలిటీ. ఇప్పుడు అన్ని వ‌స్తువుల‌కూ రేటింగ్ ఇస్తున్న విధంగానే పేరెంటింగ్ కూ రేటింగ్ ఇస్తారు. ఆన్లైన్ స‌ర్వేలూ, ఒపీనియ‌న్ పోల్స్ కూడా కండెక్ట్ చేయ‌గ‌ల‌రు. పిల్ల‌ల బాధ్య‌త పెద్ద‌ల‌ది ఎదిగే వ‌ర‌కూ కానీ ఎదిగా త‌ల్లీనీ తండ్రినీ అనాథ‌లను చేయ‌డ‌మే ఇప్ప‌టి వారి బాధ్య‌త. త‌ల్లీ తండ్రీ స‌ర్వ‌స్వం అనుకోవ‌డం జ‌ర‌గ‌ని ప‌ని.
మోడ్ర‌న్ టైం లో ఎవ్వ‌రికీ ఎవ్వ‌రూ అవ‌స‌రం లేదు. జ‌న్మ‌నిచ్చిన త‌ల్లి అక్క‌ర్లేదు. పెంచిన తండ్రి అక్క‌ర్లేదు. బాల్యం అక్క‌ర్లేదు. అంద‌మ‌యిన ఊహ‌ల‌తో నిండిన బాల్యం అక్క‌ర్లేదు. కేవ‌లం వాళ్లో వ‌స్తువులు.. వీళ్లొక వ‌స్తువులు..క‌నుక అవి ఫీలింగ్స్ లేకుండానే బతుకుతాయి. బ‌త‌కాలి కూడా! కానీ భ‌రించ‌లేని మోసాన్ని బిడ్డే చేస్తాడు. అమ్మ మాత్రం విని ఊరుకోవాలి. భ‌రించ‌లేని బాధ‌ను బిడ్డే ఇస్తాను అంటాడు నాన్న మాత్రం స‌రే ఇవ్వు భ‌రిస్తాను అని చెబుతాడు. ఇదీ ఇవాళ్టి క‌థ.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: