ఈ శుక్రవారం : వాన దసరా మరియు ....
వాన అంటే ఇష్టం. పిల్ల గాలి ఊసు ఇష్టం అని రాసి ఊరుకోవాలిక. పండుగ రోజు పరికిణీ ఓణీల కాలం చెల్లిపోయింది అని అనుకుం టూ గుడికి పోలేదు. మనిషి తనని తాను తగ్గించుకుంటూ ప్రకృతిని తగ్గిస్తున్నాడు. అబ్బా! మాకూ ఓ బతుకమ్మ పండుగ ఉంటే ఎంత బాగుండు అన్న ఊపిరి ఊసు విన్నాక సంతోషించేను. కానీ ఈ మనుషులు తమ దగ్గర సంస్కృతుల్లో, పండుగల్లో తమని తాము ఎందుకు చూసుకోవడం లేదు..అని కూడా అనుకుంటాను. ఉన్నవన్నీ మంచివే అన్న స్పృహ నాకెంతో ఆనందాన్ని ఇ స్తుంది. రాయక తప్పించుకోవడంలో ఎంతో బా ధ్యత ఉంది. పదహారేళ్ల కిందట నేను రాయక తప్పించుకున్నాక, ఇప్పుడు రాయక తప్పడం లేదు అని చెప్పడం భలే నవ్వొస్తుం ది. ఎందుకు రాయడం.. ఏమిటి రాయడం.. ఏమి నీ రాత అని ఎవ్వరయినా అంటే మళ్లీ నవ్వుకుంటాను. తెంపరితనం కారణంగా రాసిన మాటలు ఎంత పేరు తెచ్చాయో! అవును ఉన్నవన్నీ అస్సలు నా కన్నా చాలా చిన్నవన్న భావనలో నేను ఎక్కువగా ఉంటాను. అందుకే రాసేవాళ్ల కన్నా రాయాలని ఆలోచన ఉన్నవారినే ఎక్కువగా ప్రో త్సహిస్తాను. ఉన్నవి చాలా చిన్నవి అన్న ఒక్క చిన్న దృక్పథం నన్ను పెద్దాడ్ని చేసింది. అదే ఇంతటి విస్తృతిని ఇచ్చింది. ఇచ్చిం ది అని రాయకూడదు ప్రసాదించింది అని రాయాలి.
ప్రేమ ఇచ్చింది కాదు ప్రసాదితం..అవును! ప్రసారితం అని కూడా రాయాలి. ఆనందించాను నేను..పండుగలకు వచ్చి వెళ్లే కొన్ని వాన లు నాకెంతో ఇష్టంగానూ తోచాయి. ఇంటి పట్టున ఉండే వాన నాకెంతో ఇష్టం.. నీడ పట్టుకు చేరిన వాన ఇంకా ఇష్టం.. జడపై వాలిన వాన, మోముపై వాలిన వాన ఇంకా కొన్ని చోట్ల వాలని వాన వాలిన వాన అంటే ఎంతో ఇష్టం.. ఇష్టం అన్నది విస్తృతం.. అ నంతం కూడా రాయాలి. వాన సంప్రదాయ సంగీతం లాంటిది అని అనుకుంటాను.. స్వరం గతి తెలిశాక ఒక నడవడి ముందే నిర్ణ యం అయి ఉంటుంది. కానీ చెప్పాపెట్టకుండా వచ్చే వానలు నాకు కోపం తెప్పిస్తాయి.
అప్పుడు కూడా భలే నవ్వుకుంటాను. వానలో తడిశాక నాన్న కొట్టిన రోజు, అమ్మ తిట్టిన రోజు ఒకే సారి గుర్తుకు వస్తే మళ్లీ కన్నీ ళ్లు వస్తాయి. అప్పుడు అనుకుంటాను ఈ జీవితం ఇంతటి గొప్ప కీర్తినో పేరునో దక్కించుకుని చెలామాణీ అవుతుందంటే అందు కు కారణం కన్నీటి వానే కదా! అని అనుకుంటూ పోతాను, స్మరిస్తాను మంద స్మితంతో..! అమ్మనాన్నలకు వందనాలు చెబుతూ ఇంకొన్ని ప్రయత్నాలకు ఏదో ఒక ఆరంభ స్థానం వెతికి విసిగి ఒక చోట ఆగి పోతాను. నాతో పాటే వాన కూడా ఆగిపోతుంది.. అ లాంటి చోట కోరుకున్న ఏకాంతాలను ఈ దసరా అందిస్తే చాలు.. ఏకాంత యవ్వనాలను ప్రసాదిస్తే పునః ప్రసాదిస్తే ప్రేమ పునరు త్పాదన అవుతుంది.. పునరుత్తేజితం కూడా అవుతుంది..అంతటి వానకు ఓ నమస్సు. ప్రణయం ఏదయినా బాగుంటుంది కనుక నమస్సు.. నమ్మకం అయిన నమస్సు అని రాయాలి నేను..
- రత్న కిశోర్ శంభుమహంతి