లైఫ్ స్టైల్: ఫ్రిజ్ లో వుంచిన నిమ్మకాయలు వాడితే ఏమి జరుగుతుందో తెలుసా..?
కరోనా ఉదృతి ఎక్కువైనా తరుణంలో ప్రతి ఒక్కరు నిమ్మకాయలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు.. ఎందుకంటే ఇందులో ఉండే విటమిన్ సి మన శరీరంలో యాంటీ బయాటిక్ గా పనిచేస్తుంది.. కాబట్టి దీనిని ఉపయోగించడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే అటూ నాన్ వెజ్ ఇటూ వెజ్ అయినా నిమ్మకాయలను ఉపయోగిస్తున్నారు.. ఇకపోతే ఫ్రిజ్లో పెట్టి నిమ్మకాయలను తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
నిమ్మకాయలను ఫ్రిజ్లో పెట్టి తినడం వల్ల పులుపు తనం తగ్గిపోతుంది.. నిమ్మకాయలో ఆయుర్వేద ఔషధాలు పుష్కలంగా ఉంటాయన్న విషయం తెలిసిందే.. విటమిన్-సి వల్ల మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడే గుణాలు ఈ నిమ్మకాయ కి ఉంటాయి. క్యాన్సర్ ని నిరోధించే పదార్థాలు కూడా నిమ్మకాయలో ఉంటాయని వైద్యులు చెబుతున్నారు..అంతే కాదు నిమ్మకాయలలో ఉండే రసం తాగడం వల్ల బిపి అదుపులో ఉంచి మానసిక ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందట. ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలను కూడా అధిగమించవచ్చు..
సాధారణంగా రూమ్ టెంపరేచర్ లో పెట్టిన నిమ్మకాయల కంటే ఫ్రిజ్లో పెట్టిన నిమ్మకాయల రుచి గా ఉంటాయని చెబుతున్నారు.. ఫ్రిజ్లో పెట్టి నిమ్మకాయలు వాడడం వల్ల ఎసిడిటీ కూడా తగ్గుతుందట.. నిమ్మకాయ రసంలో కంటే నిమ్మకాయ తొక్క లోనే ఐదు నుంచి పది రేట్లు విటమిన్-సి తో పాటు అనేక పోషకాలు ఎక్కువగా ఉంటాయట.. నిమ్మ తొక్కలను కూడా ఉపయోగించడానికి ప్రయత్నం చేయండి.. అయితే ఈ నిమ్మకాయల ఫ్రిజ్ బ్లో పెట్టేముందు నిమ్మకాయలను శుభ్రంగా కడిగి పెడితే చాలాకాలం మన్నిక వస్తాయి.