లైఫ్ స్టైల్ : భయంకరమైన దగ్గు వస్తోందా..? ఒకసారి ఇలా చేసి చూడండి..!

Divya
దగ్గు అంటేనే చాలామంది భయపడతారు ..ఎందుకంటే ఊపిరితిత్తుల్లో కూడా భయంకరమైన నొప్పి , గొంతులో మంట, దగ్గ లేక అలసిపోవడం వంటి ఎన్నో బాధలను భరించలేక దగ్గు అనగానే అమ్మో అంటూ పరిగెత్తుతారు.. కరోనా కాలంలో దగ్గు అంటే ఇక అంతే.. పై ప్రాణాలు పైనే పోతాయి. ఇప్పుడు కరోనా కాలం కాబట్టి ఏ దగ్గు ఎలాంటి అనారోగ్యాన్ని సూచిస్తుందో కూడా మనకు తెలియదు.. ఇక ఈ దగ్గు ఎలాంటిదైనా సరే భరించే వాళ్ళకే ఆ బాధ తెలుస్తుంది.. ఇక పోతే ఇలాంటి తీవ్రమైన నొప్పి నుంచి బయట పడాలి అంటే, ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలను చదివి తెలుసుకుందాం..
ముందుగా మీకు వచ్చే దగ్గు కఫం వల్ల కలుగుతున్న దగ్గా లేక పొడిదగ్గా అనే విషయాలపై ఒక నిర్ధారణకు రావాలి. ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత దానికి సంబంధించిన వైద్యాన్ని తీసుకోవడం చాలా మంచిది..
1. దగ్గు మీకు బాగా ఎక్కువ అయినప్పుడు, రోజుకు రెండు పూటలా ఒక గ్లాసు పాలలో చిటికెడు వెల్లుల్లి పేస్ట్ లేదా అల్లం వేసి బాగా మరిగించాలి. కొద్దిగా పసుపు వేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే గొంతులో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వెంటనే తగ్గిపోతుంది..
2. అంతేకాదు ఒకవేళ దగ్గు తీవ్రత ఇంకా ఎక్కువైతే, తిప్పతీగ రసాన్ని కషాయం చేసుకొని తాగవచ్చు.. ఇది మన శరీరంలో కలిగే వాత, కఫ, పిత్త దోషాలను నివారించి , రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
3. దానిమ్మ రసంలో కొద్దిగా అల్లం పొడి, పిప్పాలి పొడి కలిపి తాగినా కూడా దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.
4. వేడి వేడిగా ఉండే కొద్దిగా మసాలా టీ తాగినా కూడా మంచి ఉపశమనం కలుగుతుంది.
5. తేనె, కొద్దిగా దాల్చిన చెక్క పొడి నీటిలో వేసుకుని ఉదయం, సాయంత్రం తాగినా కూడా దగ్గు నుంచి విముక్తి పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: