"వైవి"ధ్యం : వాడిన పూలే వికసించులే !
ఇదీ టీటీడీ నయా నిర్ణయం.. ఆ కథ ఈ వివరం వినండిక - చదవండిక
స్వామి పూలే అగరు ధూపం
తిరుమల గిరికి సరికొత్త పరిమళం
పూజలు చేయడం..పూలను కోరి కోరి ఎంపిక చేసి మరీ! పూజించడంలో భక్తి ఒక్కటే కాదు శ్రద్ధ కూడా కనిపించే విషయం..స్వా మికి ఎన్ని సేవలు..ఎన్ని కోరికలో.. అన్నిం టిలోనూ అర్చన కీలకం.. పుష్పార్చనకు టీటీడీ ఇచ్చే ప్రాధాన్యం ప్రశంసనీయం..ఆ.. రంగు పూల తోటల్లో ఆ..పరిమళాల దారుల్లో మళ్లీ మరో కొత్త సంబరం..స్వామి పాదాల ను తాకిన పూలు, స్వామి అర్చనకు ఉప యోగించిన పూలు, దేవ దేవుడిని పలకరించిన పూలు మళ్లీ మరో మంచి రూపంలో అగరు ధూపంలో భక్తులను పలకరించను న్నాయి. ఈ రూపాంతరీకరణ ప్రక్రియకు త్వరలోనే శ్రీకారం.
తిరు వీధుల వెలిగే స్వామిని
గర్భ గుడిలో దేవేరుల మధ్య
నడయాడు స్వామిని
అర్చించే పూలు ఏం చేస్తారు??
సమీపంలో ఉన్న ఏ కోనేటిలోనే
అనుపు చేస్తారు..
కానీ ఇప్పుడు ఆ చర్య వద్దని
కొత్త నిర్ణయం ఒకటి తీసుకున్నారు
అదేంటంటే ....
ఇల వైకుంఠ పురి తిరుమలలో ఓ కొత్త అధ్యాయం ఆరంభం కానుంది. స్వామికీ,దేవేరులకూ అలంకరించే పూలతో అగరు బత్తీల త యారీకి సన్నాహాలు చేస్తున్నారు. ఇకపై ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు బెంగళూరుకు చెందిన దర్శన్ అనే అంతర్జాతీయ సంస్థకు సంబంధి త బాధ్యతలు అప్పగించారు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ జవహర్ రె డ్డి. ఈ మేరకు ఒప్పందాలు కూడా కుది రాయి. సీనియర్ జర్నలిస్టు దుర్గా అందించిన సమాచారం అనుసరించి లో లాస్ నో గెయిన్ ప్రాతిపదికన ఏడు రకాలలో అగరు బత్తీ లు తయారు చేసి, అనంతరం వాటిని టీటీడీకి అందజేస్తారు. వీటిని తిరుమల,శ్రీనివాస మంగాపురం, తిరుచానూరుతో పాటు ఇతర ఆధ్యాత్మిక కేంద్రాలలో విక్రయించి, సం బంధిత ఆదాయాన్ని గో సంరక్షణార్థం వినియోగిస్తారు. సెప్టెంబర్ తొలి వారంలో తొలి విడత విక్రయాలు ఆరంభం కానున్నాయని తెలుస్తోంది.
స్వామికి పుష్పార్చన అంటే
ఎంతో ఇష్టం అని పుష్ప ప్రియుడు అని
వైదికం చెబుతోంది. మరి! స్వామిని
అర్చించే పూవులో! వాటికెంత అదృష్టమో!
అని భావించడం భక్తుల వంతు
త్వరలో ఆ సేవలకు మనం కూడా భాగం కావడం
ఓ భాగ్యం.. భక్తుడూ భగవంతుడూ అనుసంధానితం
అయ్యే ఆనంద హేల ఇంకొద్ది రోజుల్లోనే...