లైఫ్ స్టైల్: ఇంటి ఆవరణంలో పెంచే మొక్కలకు ఎలాంటి ఎరువులు వాడాలి..

Divya

సాధారణంగా మొక్కలు మనకు ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తాయి. అందుకే ప్రతి ఒక్కరూ కనీసం ఒక అరగంట సేపైనా ప్రకృతిలో గడపాలని ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో పట్టణాలలో ప్రత్యేకంగా పార్కులను ఏర్పాటు చేయడంతో అందరూ అక్కడికి వెళ్లి కాలక్షేపం చేస్తుంటారు. ప్రతి రోజూ అదే పనిగా సమయం కుదుర్చుకొని మరీ, పార్క్ లకు వెళ్లడం కొంతమందికి వీలు పడడం లేదు. అలాంటి వారు ఇంట్లోనే, ఇంటి ఆవరణంలో  చిన్న చిన్న మొక్కలను పెంచుకుంటూ పర్యావరణాన్ని మరింత అద్భుతంగా మార్చుతున్నారు. ముఖ్యంగా ఇంటి ఆవరణలో పెంచుకోవడానికి కొన్ని రకాల మొక్కలు మాత్రమే అనువుగా ఉంటాయి. అయితే ఇంటి ఆవరణంలో పెంచే మొక్కలకు ఎలాంటి ఎరువులు వాడాలి.. ఎంత మోతాదులో వాడాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంటి ఆవరణలో పెంచుకొనే మొక్కలకు సరైన పెప్టిసైడ్స్ అందించడం చాలా అవసరం. అయితే మనకు మార్కెట్లో దొరికే ఎరువుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. రసాయనిక ఎరువుల ద్వారా పండించే కాయగూరలు ,ఆకు కూరలు తినడం వల్ల మనకు కూడా కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సహజసిద్ధంగా ఇంట్లోనే సేంద్రియ ఎరువులను తయారు చేసుకొని , ఇంటి ఆవరణంలో మొక్కలకు వేయడం ద్వారా మొక్కలు ఆరోగ్యంగా పెరగడమే కాకుండా, పోషకాలు కలిగిన పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు మనకు లభిస్తాయి.

ఇక ఇంట్లోనే ఎరువులు తయారు చేసుకోడానికి కావలసిన పదార్థాలు.. వేపాకులు, నీళ్లు, బేకింగ్ సోడా, ఒక ఖాళీ బాటిల్.. బాటిల్ తో స్ప్రే చేయడానికి అనువుగా ఉంటుంది కాబట్టి.
తయారీ విధానం:
స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక గిన్నె పెట్టి, అందులో నీళ్ళు పోసి బాగా మరిగించాలి. మరుగుతున్న నీటిలో కడిగిన వేపాకులను వేసి మరో ఒక పదిహేను నిమిషాలపాటు బాగా మరగనివ్వాలి. ఇప్పుడు స్టౌ ఆఫ్ చేసి, ఆ  నీటిని వడకట్టి వేపాకులను వేరుచేయాలి. ఇప్పుడు వడకట్టిన నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా కలిపి బాగా మిక్స్ చేయాలి. ఇక పూర్తిగా చల్లారిన తర్వాత స్ప్రే బాటిల్ లో ఈ నీటిని పోసి, మొక్కలపై స్ప్రే చేయడం వలన మొక్కలకు మంచి ఎరువులు లభించడమే కాకుండా అవి ఆరోగ్యంగా ఏపుగా పెరగడానికి వీలుగా ఉంటుంది. ఇక రోజుకు ఒకసారి స్ప్రే చేయడం వల్ల మరింత ఆరోగ్యంగా పెరుగుతాయి. అంతేకాదు మొక్కలకు పట్టిన చీడ పురుగులు కూడా నాశనం అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: