వీకెండ్ మనుషులకే.. మహమ్మారికి కాదు.?

praveen
సాధారణంగా వీకెండ్ వచ్చింది అంటే జనాలు ఎలా రెచ్చి పోతూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  వారం మొత్తం పని చేయడం ఇక వీకెండ్ వచ్చింది అంటే ఫుల్ గా ఎంజాయ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. లేదా ఏదైనా స్పెషల్ గా ప్లాన్ చేస్తూ ఉంటారు.  తమ ప్రియమైన వారితో బయటికి వెళ్లడం లేదా సినిమాలు షికార్లకు వెళ్ళడం..  స్నేహితులతో పార్టీలు చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.  ఇక సిటీ కల్చర్ కి అలవాటు పడిన వారు పబ్బులు క్లబ్బులు అంటూ మరింత ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ కరోనా వచ్చిన తర్వాత వీకెండ్ అనే మాటే మరిచిపోయారు అందరు.

 వారం మొత్తం పని చేసే సమయంలో కూడా కరోనా వైరస్ ఎక్కడ వ్యాప్తి చెందుతుందో అని భయపడుతూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఉన్న జనాలు ఇక సండే లాంటి వీకెండ్ వచ్చిందంటే ఇంటికే పరిమితమవుతున్నారు. బయటికి వెళ్ళాలి అని ఆలోచన వచ్చినా ఇక భయంతో చివరికి వెనకడుగు వేస్తున్నారు. కానీ కొంత మంది మాత్రం ఇప్పటికి కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో వీకెండ్ లో ఎంజాయ్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.  ఈ క్రమంలోనే స్నేహితులతో కలిసి ఎక్కడికైనా వెళ్ళడం పార్టీలు చేసుకోవడం పబ్బులు క్లబ్బులు అంటూ తెగ ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

 అయితే ప్రస్తుతం ఇలాంటి వారినే హెచ్చరిస్తున్నారు అధికారులు.  వీకెండ్ మనుషులకు ఉంటుందేమో కానీ కరోనా వైరస్కు ఉండదని అందుకే అందరూ తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. వీకెండ్ వుంది కదా అని బయటకు వెళితే మాత్రం మరో వీకెండ్ లేకుండా అయిపోతారు అంటూ హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకి విజృంభిస్తున్న తరుణంలో వీకెండ్ సమయంలో ఇంటికే పరిమితం కావడం ఎంతో మంచిది అంటూ సలహా ఇస్తున్నారు నిపుణులు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: