నోరూరించే పెప్పర్ పన్నీర్ ను ఎలా తయారు చేస్తారంటే..

Satvika
పన్నీర్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరేమో.. ఎందుకంటే రోజు తినే దోశ దగ్గర నుంచి, అప్పుడప్పుడు చేసుకొనే కబాబ్స్ వరకు ప్రతి ఐటెం లో పన్నీర్ ఉంటుంది. చిన్న పిల్లలు కూడా వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. అందుకే ఇప్పుడు రెస్టారెంట్ యాజమాన్యం కూడా భోజన ప్రియులను ఆకర్షించడా నికి కొత్త కొత్త వంటలను తయారు చేస్తున్నారు. ఇప్పటికే వింత పేర్లతో ఎన్నో రకాల వంటలను తయారు చేశారు. ఇప్పుడు మరో పన్నీరు వంటను పరిచయం చేశారు. అదే పెప్పర్ పన్నీర్.. ఈ ఐటెం ను ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ..
కావలసినవి పదార్థాలు..
పనీర్‌ ముక్కలు: రెండు కప్పులు,
ఉల్లిపాయ: ఒకటి పెద్దది,
పచ్చి మిర్చి: రెండు,
అల్లం తరుగు: చెంచా,
వెల్లుల్లి తరుగు: చెంచా,
టొమాటో సాస్‌: టేబుల్‌స్పూను,
పసుపు: పావుచెంచా,
మిరియాల పొడి: టేబుల్‌స్పూను,
నూనె: టేబుల్‌స్పూను,
కొత్తి మీర: కట్ట,
ఉప్పు: తగినంత,
గరంమసాలా: అరచెంచా,
సోంపు: పావుచెంచా,
జీలకర్రపొడి: పావుచెంచా.

తయారీ విధానం ..
 ముందుగా స్టౌ వెలిగించాలి..  స్టౌమీద కడాయి పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక ఉల్లిపాయముక్కలు వేసి ఎర్రగా వేయించాలి. ఇప్పుడు అల్లం-వెల్లుల్లి-పచ్చిమిర్చిని కలిపి ముద్దలా చేసి అందులో వేయాలి. ఆ తరువాత పసుపు, గరంమసాలా, సగం మిరియాలపొడి, తగినంత ఉప్పు, టొమాటోసాస్‌ వేసి అన్నింటినీ కలపాలి. రెండు నిమిషాలయ్యాక పనీర్‌ ముక్కలు వేసి కలిపి... మిగిలిన మిరియాలపొడి, జీలకర్రపొడి, కొత్తిమీర, సోంపు, వేసి అన్నింటినీ కలిపి దింపేయాలి.. చూసారుగా చాలా సింపుల్ గా ఉండే పన్నీర్ కొత్త డిష్ పెప్పర్ పన్నీర్ రెడీ.. వేడి వేడి గా ఉన్నప్పుడే వీటిని లాగిస్తే చాలా బాగుంటాయి.. టమోట సాస్ లేదా పుదీనా చట్నీ కాంబినేషన్ లో తింటే చాలా అంటే చాలా టేస్టీ గా ఉంటాయి. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: