ఛీ.. దీనెమ్మ జీవితం అనిపిస్తోందా..ఇది ఓసారి చదవండి..?

పక్కవాడి లైఫ్ ప్రతి వాడికీ ఈజీగానే ఉంటుంది.. కానీ ఎవడి లైఫ్ వాడికి కష్టంగా ఉంటుందని ఓ సినిమా డైలాగ్ ఉంది. ఇది అక్షరాలా నిజం.. పక్కవాడు తన సమస్యను చెప్పినప్పుడు చాలా మంది ఈజీగా తీసుకుంటారు. కానీ.. ఎదుటి వ్యక్తి చెప్పేదాన్ని వినడం ద్వారా జీవితంలో చాలా నేర్చుకోవచ్చు. ప్రత్యేకించి వినడం ద్వారా జీవితంలో చాలామంది స్నేహితులను సంపాదించుకోవచ్చు. అలాగే జీవితాన్ని ఎప్పుడూ మన కోణం నుంచే కాకుండా.. ఎదుటి వాడి కోణం నుంచి చూడటం అలవాటు చేసుకుంటే.. జీవితం నిస్సారంగా కనిపించదు.
ఉదాహరణకు.. మనం పది నిమిషాలు గృహిణి ముందు కూర్చుంటే.. జీవితం చాలా కష్టం అనిపిస్తుంది.. అదే మనం.. పది నిమిషాలు తాగుబోతు ముందు కూర్చుంటే.. అబ్బో జీవితం చాలా సరళం అనిపిస్తుంది... ఓ పది నిమిషాలు సాధువులు, సన్యాసుల ముందు కూర్చుంటే.. ఉన్నదంతా దానం చేయాలని అనిపిస్తుంది.. పది నిమిషాలు నాయకుడి ముందు కూర్చుంటే..
మనం చదివింది అంతా వృధా అనిపిస్తుంది.
అలాగే.. ఓ పది నిమిషాలు జీవిత బీమా చేసే ఏజెంటు ముందు కూర్చుంటే.. చస్తేనే మంచిది అనిపిస్తుంది. పది నిమిషాలు వ్యాపారుల ముందు కూర్చుంటే... మన సంపాదన చాలా తక్కువ, దేనికీ సరిపోదు అనిపిస్తుంది.. పది నిమిషాలు అధికారుల ముందు ముందు కూర్చుంటే ఈ ప్రపంచం మరీ స్లో అనిపిస్తుంది... పది నిమిషాలు శాస్త్రవేత్తల ముందు కూర్చుంటే మనం ఎంత అజ్ఞానులమో అనిపిస్తుంది. పది నిమిషాలు ఉపాధ్యాయుల ముందు కూర్చుంటే మనం మళ్లీ విద్యార్థులం కావాలని అనిపిస్తుంది.

ఓ పది నిమిషాలు రైతులు, కార్మికుల ముందు కూర్చుంటే .. వారు పడే కష్టం మనం పడడం లేదనిపిస్తుంది. పది నిమిషాలు సైనికుల ముందు కూర్చుంటే .. వారి ముందు మన త్యాగం, సేవల ముందు ఏమీ లేదనిపిస్తుంది. పది నిమిషాలు స్నేహితుని ముందు కూర్చుంటే జీవితం స్వర్గంలా ఉంటుంది. ప్రతి చోటా అదే పది నిమిషాలు.. కానీ మనకు ఒక్కొక్కరు ఒక్కో పాఠం నేర్పిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: