ఎముకలు దృఢంగా ఉండాలంటే ఈ జ్యూస్ తాగాల్సిందే..

Satvika
మానవ శరీరం నిర్మాణం ఎముకలతో నిర్మితమై ఉంటుంది. ప్రతి కదలిక అనేది ఎముకల ఆధారంగా పని చేస్తుంది.అందుకే ఎముకలు దృఢంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం అవసరం. కొన్ని ఆహార పదార్థాలలో కాల్షియం ఉంటుంది. ఎటువంటి వాటిలో కాల్షియం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.. సైన్స్ పరంగా చెప్పాలంటే కొల్లాజెన్, కాల్షియం లతో ఎముకలు తయారవుతాయి..


కీర దోసకాయ.. 


ఈ కాయలో విటమిన్ సి, డి, ఎ తో పాటుగా కాల్షియం కూడా అధికంగా ఉంటుంది.వీటితో పాటుగా మెగ్నీషయం, పొటాషియం ఉంటుంది.కన్నెక్టీవ్ టిష్యూస్ పెరుగుదల, బలోపేతం చేయడానికి సహాయపడే సిలికా కూడా దీనిలో ఉంటుంది. విటమిన్ సి అధికంగా ఉండే ఆరెంజ్ జ్యూస్తో పాటు తినేటప్పుడు, కీర దోసకాయలు యూరిక్ యాసిడ్ను మీ శరీరం నుండి బయటకు పంపడం ద్వారా స్థాయిలను తగ్గించటానికి సహాయపడతాయి.


పాలకూర.. 


పాలకూర మీ ఎముకల ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు అందించే ఆకుకూరల్లో పాలకూర ముఖ్యమైనది. పాలకూరలో విటమిన్ కె చాలా ఎక్కువగా ఉంటుంది. కేవలం 1 కప్పు పాలకూర మనకు ఒక రోజుకు కావలిసిన విటమిన్ కె శాతంలో 181 శాతం అందిస్తుంది. ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైన కాల్షియం మరియు మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి. 

అల్లం.. 


ఘాటైన అల్లం లో చాలా రకాల పోషకాలు ఉంటాయి. జింజెరోల్ అని పిలువబడే ఒక ప్రత్యేకమైన సేంద్రీయ సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది. ఇది శక్తివంతమైన శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది.సైటోకిన్స్ వంటి తాపజనక సమ్మేళనాలు ఎముకలపై ప్రభావం చూపడానికి ముందే వాటిని అణిచివేసేందుకు.. అయితే జింజెరోల్ ప్రముఖ పాత్రను పోషిస్తుంది. 



ఆరెంజ్ జ్యూస్.. 

ఆరెంజ్ లో సి విటమిన్ , విటమిన్ డి లు ఉంటాయి..కండరాలు, ఎముకలకు అవసరమైన ముఖ్య పోషకం.విటమిన్ డి మన శరీరం కాల్షియం గ్రహించడానికి సహాయపడుతుంది. కాల్షియం ఎముకలు బలంగా తయారవ్వడానికి సహాయపడుతుంది. అందుకే ప్రతి రోజూ ఆరెంజ్ తీసుకోవడం మంచిది.. ఎముకలు దృఢంగా ఉంటాయి. 



వీటితో పాటుగా గ్రీన్ యాపిల్స్ ను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.. పైన తెలిపిన వా టిలో కాల్షియం ఉంటుంది.. మీ ఆహారంలో వీటిని తీసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు.. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: