ఈ ఫుడ్ లలో వేటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎక్కువ రోజులు బ్రతికుతారంటే?

Satvika
ప్రస్తుతం కాలంలో కరోనా మహమ్మారి పుణ్యమా అని ఏం చేయాలన్నా కూడా సరిగ్గా చేయలేకున్నారు.. ముఖ్యంగా చెప్పాలంటే ప్రజలు గత ఏడు నెలలుగా సరిగ్గా తినలేదు, నిద్ర పోలేదు.. ఎక్కడ ఎవరిని అంటుకుంటే కరోనా వస్తుంది అనే భయంతో అల్లాడిపోతున్నారు.. ఇప్పుడు కూడా తినే ఆహారం పై చాలా సందేహాలు ఉన్నాయి. నాన్ తింటే ఎక్కువ రోజులు బ్రతుకుతారా.. లేక వెజ్ తింటే ఎక్కువ రోజులు బ్రతుకుతారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాటి గురించి నిపుణులు ఏమన్నా రో ఇప్పుడు చూద్దాం..



వెజ్ కంప్లీట్ డైట్ అని కూడా అనొచ్చు. ఇందులో ఫైబర్, విటమిన్స్ సీ, ఈ, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, అన్ సాచ్యురేటెడ్ ఫ్యాట్, ఇంకా ఫైటో కెమికల్స్ ఉన్నాయి. అందుకే, శాకాహారం మాత్రమే తీసుకునే వారికి కొలెస్ట్రాల్, బీపీ కంట్రోల్ లో ఉంటాయి. వీరికి హార్ట్ డిసీజెస్ వచ్చే రిస్క్ కూడా బాగా తక్కువ. వెజ్ వంటలను చేసుకోవడానికి ఖర్చులు కూడా తక్కువే అవుతుంది. అలాగే చేయడానికి కూడా సులువుగా అయిపోతుంది.



నాన్ వెజ్ తీసుకోవడం వల్ల చాలా రకాల సమస్యలు తలెత్తుతాయి. మాంసం తొందరగా అరగదు. ఉదర సమస్యలు తలెత్తుతాయి.. ఈ పరిస్థితుల నుంచి బయట పడాలంటే నాన్ వెజ్ ను ఎప్పుడో ఒకసారి తీసుకొని, వెజ్ ను మాత్రం రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల చాలా మంచిదట..వెజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..


కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గడం..

స్ట్రోక్, ఒబేసిటీ వచ్చే రిస్క్ దూరం..

జీవిత కాలాన్ని పెరగడం..

డయాబెటీస్ రిస్క్ దూరం..

హెల్దీ స్కిన్..

డిప్రెషన్ ని తగ్గిస్తుంది

ఫైబర్ ఎక్కువగా..

మెటబాలిజం ఇంప్రూవ్...

క్యాటరాక్ట్ డెవెలప్ అయ్యే రిస్క్ ని తగ్గడం..


అన్నిటికన్నా ఇప్పుడు ఆలోచించేది.. ఖర్చు తక్కువ.. వెజ్ కు అయ్యే ఖర్చులు చాలా తక్కువ.. ఇప్పుడు కరోనా కారణంగా ఆర్ధిక పరిస్థితి అంతమాత్రాన మాత్రమే.. అందుకే మీ ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి ఈ వెజ్ సంబంధిత ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం మంచిది.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: