సజ్జపిండి తో అలా స్వీట్ చేసుకొని తింటే క్యాన్సర్ జన్మలో రాదట..

Satvika
ఆచారాలు అనేవి దేశ సంప్రదాయాలను పెంపొందిస్తాయి.. దేశ ప్రఖ్యాతను ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్తాయి.. అయితే అప్పటిలో ఉన్న సంప్రదాయాలు ఇప్పుడు అటకెక్కాయి.. అలాంటి ఆచారాలు ఇప్పుడు ఎక్కడా కనిపించలేదు. కొన్ని మాసాలలో ప్రత్యేక నిబధనలతో దీపాలను పెడితే శరీరానికి మంచి అని నిపుణులు అంటున్నారు. ఇకపోతే ఆనాటి రుచులలో బెస్ట్ అంటే సజ్జాపిండి దీపాల స్వీట్..ఈ స్వీట్ ను ఒక్కసారి తినడం వల్ల క్యాన్సర్ దగ్గరకు రాదట.. వాటిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. సజ్జాలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ, అందుకని సజ్జలు డైజెషన్ కి బాగా హెల్ప్ చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతాయి. ఫలితంగా కార్డియో వాస్క్యులర్ హెల్త్ బావుంటుంది. సజ్జాల్లో ఉన్న యాంటి ఆక్సిడెంట్స్ కాన్సర్ ని ప్రివెంట్ చేయగలవు, ప్రత్యేకించి బ్రెస్ట్ కాన్సర్‌ని. ఇవి ఆస్థ్మా ని కూడా ప్రివెంట్ చేస్తాయి. సజ్జల వల్ల మజిల్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. అందుకే ఆనాటి వాళ్ళు ఇప్పటికీ స్ట్రాంగ్ గా ఉన్నారు.. మరో ఆ స్వీట్ కు కావలసిన పదార్థాలు తయారీ విధానం ఇప్పుడు చూద్దాం...


కావలసిన పదార్థాలు..

అర కప్పు సజ్జ పిండి

రెండు టేబుల్ స్పూన్ల ఆవు నెయ్యి 

అర కప్పు అప్పుడే తురిమిని కొబ్బరి

రెండు టీ స్పూన్ల గుమ్మడి గింజలు

పావు కప్పు తాటి బెల్లం

పావు కప్పు సన్నగా తరిగిన వాల్నట్స్

పావు కప్పు గింజలు తీసేసి తరిగిన ఖర్జూరాలు

ఒక టీ స్పూన్ ఏలకుల పొడి

రెండు టేబుల్ స్పూన్ల పాలుతయారీ విధానం..

మూకుడు లో నెయ్యి లేదా నూనె వేసి సజ్జ పిండి కూడా వేసి మంచి వాసన వచ్చేవరకూ వేయించండి. తురిమిన కొబ్బరి వేసి కొబ్బరి క్రిస్ప్ గా మారేవరకూ వేయించండి.ఇప్పుడు తాటి బెల్లం, అర టీ స్పూన్ ఏలకుల పొడి వేయండి. వాటన్నిటినీ బాగా కలిపి రెండు టేబుల్ స్పూన్ల పాలు వేసి కొద్దిగా ముద్దగా అయ్యేవరకూ కలపండి.దీనిని ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వండి.ఇదే మూకుడు లో క్రష్ చేసిన గుమ్మడి గింజలు, వాల్నట్స్, ఖర్జూరాలు వేసి, అర టీ స్పూన్ ఏలకుల పొడి కూడా వేసి కలపండి.ఇప్పుడు ఈ రెండు మిశ్రమాలనీ ఎనిమిది సమాన భాగాలు చేయండి. సజ్జ పిండి, కొబ్బరి మిశ్రమంతో ప్రమిదలు చేయండి. ప్రమిద మధ్యలో ఖార్జూరాల మిశ్రమం పెట్టండి. అరగంట సేపు ఫ్రిజ్ లో ఉంచితే ప్రమిద గట్టి పడుతుంది.. అంతే ఎంతో రుచికరమైన సజ్జాపిండీ ప్రమిద స్వీట్ రెడీ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: