జీవిత సత్యాలు: మీకు అంత అహంకారం పనికి రాదు సుమా..?

మనం నిత్యం మన మిత్రులు, శత్రువులు ఎవరని లెక్కలు వేసుకుంటాం. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలనుకుంటాం.. వారి కదలికలను, ఎత్తులను పరిశీలిస్తాం.. వారి ఎత్తుగడలకు చిక్కకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ మన అసలైన శత్రువు మనలోనే ఉన్నాడన్న విషయాన్ని మాత్రం గుర్తించం.

మరి ఇంతకూ మనలో ఉన్న అసలైన శత్రువు ఎవరు.. ఈప్రశ్నకు సమాధానం మన గర్వం, మన అహంకారమే. గర్వం, అహంకారం మనిషి పతనానికి కారణాలు. ఈ విషయాన్ని ఇప్పటికే మనకు మన పురాణాలు ఎన్నోసార్లు చెప్పాయి. ఆ కథలన్నీ మనం దాదాపుగా చదివినవీ, విన్నవే. కానీ ఎన్ని చూసినా.. ఎన్ని విన్నా.. చాలా మందిని గర్వం, అహంకారం వదిలి పెట్టవు.

అసలు అహంకారం అంటే ఏంటి.. ఏది అహంకారం.. ఏది ఆత్మవిశ్వాసం..? అహంకారం శాస్త్రీయత లేని తత్త్వమని మానసిక వైద్యనిపుణులు అంటారు. తమ గురించే తాము సదా ఆలోచిస్తూ ఇతరులను అకారణంగా చిన్నచూపు చూడటం, తప్పుల్ని వెతకడం అహంకారంగా చెప్పుకోవచ్చు. అహంకారి ఎప్పుడూ తన సంక్షేమమే చూసుకుంటాడు. తమ హితమే కోరుకుంటాడు.

అహంకారి ఎప్పుడూ తనమాటే నెగ్గాలనుకుంటాడు. తాను చెప్పిందే వేదం అంటాడు. తనను మించినవారు లేరనుకుంటారు. ఈ అహంకారం మనందరిలోనూ ఉంటుంది. అయితే అది ఎంత మోతాదులో ఉందనేది ఆలోచించుకోవాల్సిన విషయం. అహంకారంలో నేను అనే భావానికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. కానీ.. గొప్ప పాము కూడా చలిచీమల చేతిలో చస్తుంది. మహా వృక్షాలు కూడా తుపానుకు నేలకూలతాయన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: