మజ్జిగ ఇలా చేసుకుంటే బాడీ కూల్ గా అవుతుంది?

Purushottham Vinay
సొరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది.సొరకాయతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. సొరకాయ మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది.మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే కూరగాయల్లో ఈ సొరకాయ కూడా ఒకటి.సొరకాయతో మనం ఎక్కువగా కూర, పప్పు, పులుసు ఇంకా అలాగే పచ్చడి వంటి వంటకాలని తయారు చేస్తూ ఉంటాం. ఇంకా ఇవే కాకుండా సొరకాయతో మనం మజ్జిగ చారును కూడా తయారు చేసుకోవచ్చు. సొరకాయ మజ్జిగ చారు తినడానికి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడానికి కూడా అంత ఎక్కువగా సమయం కూడా పట్టదు. అలాగే దీన్ని తయారు చేయడం కూడా చాలా తేలిక. ఇక రుచిగా, కమ్మగా ఆరోగ్యానికి మేలు చేసేలా సొరకాయతో మజ్జిగ చారును ఎలా తయారు చేసుకోవాలి వంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.సొరకాయ మజ్జిగ చారు తయారీ విధానం విషయానికి వస్తే..సొరకాయ ముక్కలు ఒక కప్పు, ఉప్పు పావు టీ స్పూన్, నీళ్లు పావు గ్లాస్, నూనె  ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు ఒక టేబుల్ స్పూన్, ఇంగువ పావు టీ స్పూన్, ఎండుమిర్చి  2, కరివేపాకు ఒక రెమ్మ, అల్లం తరుగు ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి 2, పసుపు పావు టీ స్పూన్, చిలికిన పెరుగు 200 గ్రా. ఇంకా తరిగిన కొత్తిమీర  కొద్దిగా తీసుకోవాలి .


ముందుగా కళాయిలో సొరకాయ ముక్కలు, ఉప్పు ఇంకా నీళ్లు పోసి కలపాలి. వీటిపై మూతను ఉంచి ఒక 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. ఆ నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి, ఇంగువ ఇంకా కరివేపాకు వేసి వేయించాలి. ఇక తాళింపు వేగిన తరువాత సొరకాయ ముక్కలు, పసుపు వేసి కలపాలి. సొరకాయలో ఉండే నీరంతా పోయి ముక్కలు ఉడికిన తరువాత స్టవ్ ని ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత పెరుగు ఇంకా ఉప్పు తగినన్ని నీళ్లు పోసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా రుచిగా ఉండే సొరకాయ మజ్జిగ చారు తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మేలు కలుగుతుంది. ఎండా కాలంలో ఇలా సొరకాయతో మజ్జిగ చారును తయారు చేసుకుని తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: