నాలుకపై ఈ లక్షణాలుంటే ఖచ్చితంగా డాక్టర్ ని కలవండి?

Purushottham Vinay
బర్నింగ్ మౌత్ సిండ్రోమ్ లేదా బీఎంఎస్ అనేది నోటిలో మంట లేదా జలదరింపుగా వర్ణించబడని ఓ బాధాకరమైన సమస్య.ఈ సమస్య వల్ల నొప్పితో పాటు మీరు నోరుగా పొడిగా మారడం ఇంకా నోటిలో మార్పు చెందిన రుచిని కూడా మీరు అనుభవించవచ్చు.కొన్ని అధ్యయనాల ప్రకారం, విటమిన్ బీ6, విటమిన్ బీ1 ఇంకా జింక్‌తో పాటు ఇతర విటమిన్లు అలాగే ఖనిజాల లోపాల వల్ల కూడా నాలుక మంట లేదా నోటిలో మంట సిండ్రోమ్ అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా థైరాయిడ్ హార్మోన్‌ సమస్య వల్ల కూడా ఈ పరిస్థితి ఎక్కువగా సంభవిస్తుంది. ఇంకా అలాగే గ్లూకోజ్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు కూడా ఇందుకు కారణంగా ఉంటుంది. ముఖ్యంగా విటమిన్-డి లోపం వల్ల మన నోటిలో కలిగే ఇబ్బందుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక మన శరీరంలో విటమిన్ డి అనేది చాలా తక్కువగా ఉంటే శరీరం స్వయంచాలకంగా రక్తంలో తక్కువ కాల్షియం స్థాయిలను కలిగి ఉంటుంది. ఇది ఖచ్చితంగా నాలుకపై తిమ్మిరి లేదా అనుభూతి లేకపోవడం వంటి లక్షణాలను కలుగజేస్తుంది.


అప్పుడు వెంటనే డాక్టర్ ని కలవాలి.ఇంకా నాలుక పొడిబారడం అనేది మీరు అనుభవించే విటమిన్ డి లోపంకి సంబంధించిన మరో లక్షణం. ఈ లక్షణం అనుభవించిన వెంటనే అలర్ట్ అవ్వాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పొడి నోరు లేదా జిరోస్టోమియాకు విటమిన్ లోపాలతో పాటు డీహైడ్రేషన్, ఆల్కహాల్ వాడకం, ధూమపానం ఇంకా ఆందోళన, కొన్ని మందుల వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంది.విటమిన్ డి లోపం వల్ల నోరు పొడిబారడం వల్ల మీ కావిటీస్, నోటి వ్యాధులు ఇంకా ఎన్నో ఇతర సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.ప్రతి రోజు కూడా మన శరీరానికి సూర్యరశ్మి తగిలేలా జాగ్రత్తలు కనుక తీసుకుంటే విటమిన్-డి లోపం నుంచి చాలా త్వరగా బయటపడవచ్చు.అందుకే కచ్చితంగా రోజుకు 10-20 నిమిషాల పాటు ఎండలో గడపాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా అలాగే ఆహారంలో కూడా పాలకూర,బెండకాయ, సోయాబీన్స్, తెలుపుబీన్స్ ఇంకా చేప వంటివి ఉండేలా చూసుకోవాలని కూడా ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: