ముల్లంగితో వీటిని కలిపి తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!

Divya
ముల్లంగిలో ఎన్నో రకాల విటమిన్లు, పోషకాలు మన శరీరానికి తిన్నప్పుడు లభిస్తాయి. ముఖ్యంగా ముల్లంగిని సరైన సమయానికి సరైన పద్ధతిలో తింటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. లేదంటే కడుపునొప్పి, గ్యాస్ , అజీర్తి వంటి సమస్యలు వస్తాయని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇకపోతే ముల్లంగిని కొన్ని రకాల ఆహార పదార్థాలతో ప్రత్యేకించి తినకూడదట.. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ముల్లంగిలో యాంటీ ఆక్సిడెంట్ , యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంతో పాటు దగ్గు, నోటి సమస్యలు,  జలుబు వంటి సమస్యలను దూరం చేయడమే కాదు ఉదరం,  మూత్రపిండాలు,  డయాబెటిస్ సమస్యలను మొదలు క్యాన్సర్ వరకు అనేక సమస్యల నుంచి మనకు ఈ ముల్లంగి ఉపశమనం కలిగిస్తుంది. సాధారణంగా చాలామంది నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో ముల్లంగి తింటూ ఉంటారు. అలా తినకూడదు.. అల్పాహారం తర్వాత లేదా భోజనానికి ముందు మాత్రమే ముల్లంగి తీసుకోవాలి.  ఒకవేళ సాయంత్రం పూట సలాడ్ లాగా ముల్లంగిని తీసుకోవచ్చు.
ముల్లంగితోపాటు టమాటా, ఉల్లిపాయ , దోసకాయ,  క్యారెట్ మొదలైన ఇతర పచ్చి కూరగాయలను సలాడ్లో భాగంగా తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ముల్లంగిని నల్ల ఉప్పుతో కలిపి తింటే జీర్ణక్రియ రేటు మెరుగు పడుతుంది. ముల్లంగి తిన్న తర్వాత కొంతసేపు నడవాలి లేకపోతే గ్యాస్ , ఆసిడిటీ వంటి సమస్యలు ఎక్కువవుతాయి. రాత్రిపూట ముల్లంగిని ఏ రూపంలో కూడా తినకుండా ఉండడమే మంచిది. అలాగే ముల్లంగి - పాలు, ముల్లంగి - కాకరకాయ,  ముల్లంగి - నారింజ,  ముల్లంగి - కీరదోస వంటి కాంబినేషన్లో ఎప్పుడూ కూడా తినకూడదు.కనీసం 24 గంటల గ్యాప్ ఉండాలి అని నిపుణులు చెబుతున్నారు.  శుభ్రంగా కడిగి వాటి తొక్క తీసిన తర్వాత మాత్రమే తినాలని సూచిస్తున్నారు. మరి చూశారు కదా ముల్లంగిని ఎలా తినాలో ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యం మరింత పదిలం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: