బీట్ రూట్ ని ఇలా మాత్రమే తినాలి? లేదంటే..?

Purushottham Vinay
బీట్ రూట్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో మన శరీరానికి అవసరమయ్యే చాలా రకాల పోషకాలు ఉన్నాయి. బీట్ రూట్ ను ఆహారంగా  తీసుకోవడం వల్ల మనం చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను చాలా సులభంగా దూరం చేసుకోవచ్చు. బీట్ రూట్ ను ఎలా తీసుకోవడం వల్ల జీవితాంతం మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.. పై భాగం చెక్కు బాగా పలుచగా ఉండే బీట్ రూట్ ను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఈ చెక్కును వీలైనంత పలుచగా తొలగించాలి.అదే విధంగా బీట్ రూట్ పై భాగంలో ఉండే తొడిమను తక్కువగా తొలగించాలి.ఇంకా అలాగే ఈ బీట్ రూట్ ను ముందుగా నీటితో శుభ్రపరిచిన తరువాత మాత్రమే పై చెక్కును తీయాలి. ఇక చెక్కు తీసిన తరువాత బీట్ రూట్ ను కడగకూడదు. అదే విధంగా ఈ బీట్ రూట్ ను వీలైనంత పెద్ద ముక్కలుగా కూడా కట్ చేయాలి. అలాగే దీనిని కూరగా వండేటప్పుడు కూడా దానిపై ఖచ్చితంగా మూతను ఉంచి వండాలి.


అలాగే ఈ బీట్ రూట్ ను జ్యూస్ గా చేసి ఉదయం పూట తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ బీట్ రూట్ తో పాలకూర ఇంకా క్యారెట్ వంటి వాటిని కలిపి స్మూతీగా చేసుకుని తాగడం మంచిది.ఇంకా అలాగే ఈ జ్యూస్ లలో పంచదార, బెల్లం వంటి వాటిని కలపకుండా మాత్రమే తీసుకోవాలి.బీట్ రూట్ జ్యూస్ ను తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది కదా అని ఒకేసారి దీనిని ఎక్కువ మొత్తంలో మాత్రం అస్సలు తీసుకోకూడదు. అయితే కొత్తగా బీట్ రూట్ జ్యూస్ ను తాగడం అలవాటు చేసుకోవాలనుకునే వారు ముందుగా అర గ్లాస్ మోతాదులో ఈ జ్యూస్ ను తాగాలి. ఇక ఎటువంటి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉన్నప్పుడు మాత్రమే దీనిని ఒక గ్లాస్ మోతాదులో తాగాలి. బీట్ రూట్ జ్యూస్ ను తాగడం వల్ల రక్తహీనత సమస్య కూడా చాలా ఈజీగా తగ్గుతుంది. ఇంకా అలాగే వయసు పైబడే కొద్ది వచ్చే మతిమరుపు సమస్య కూడా మీకు తలెత్తకుండా ఉంటుంది. ఇంకా అలాగే బీట్ రూట్ లో యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: