వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు?

Purushottham Vinay
కాబూలీ శనగలు ఆరోగ్యానికి చాలా విధాలుగా మేలు చేస్తాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలా మంది శనగలు తింటే గ్యాస్ వస్తుంది ఇంకా చీము పడుతుంది అని రకరకాలుగా అపోహ పడుతూ ఉంటారు. కానీ కాబూలీ శనగలను తగిన మోతాదులో తీసుకోవడం వల్ల ఎలాంటి హాని కలగకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 100 గ్రాముల కాబూలీ శనగల్లో 285 కిలో క్యాలరీల శక్తి, 40 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 19 గ్రాముల ప్రోటీన్స్, 5 గ్రాముల కొవ్వులు, 25 గ్రాముల ఫైబర్ ఇంకా అలాగే 233 మైక్రో గ్రాముల ఫోలిక్ యాసిడ్ అనేది ఉంటుంది. అందువల్ల ఇవి చాలా తేలికగా జీర్ణమవుతాయి కూడా.ఇంకా అలాగే గ్యాస్ ను కూడా ఇవి చాలా తక్కువ మోతాదులో విడుదల చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా చాలా ఈజీగా అదుపులో ఉంటాయి. కాబూలీ శనగల్లో ఉండే ప్రోటీన్ ఇంకా ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఖచ్చితంగా అదుపులో ఉంచుతాయి.


అందుకే ప్రతిరోజూ ఒక కప్పు ఉడికించిన కాబూలీ శనగలను తీసుకోవడం వల్ల మనం తీసుకునే ఆహారంలో ఉండే గ్లూకోజ్ 35 శాతం రక్తంలో కలకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు పరిశోధనల ద్వారా తెలియజేసారు. ఇంకా అలాగే డయాబెటిస్ వ్యాధి గ్రస్తులకు కాబూలీ శనగలు చక్కటి ఆహారమని వీటిని తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే కాబూలీ శనగలను తీసుకోవడం వల్ల ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడంతో పాటు ఇన్సులిన్ నిరోధకత కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇంకా అలాగే ఈ శనగలను తీసుకోవడం వల్ల భవిష్యత్తులో షుగర్ వ్యాధి బారిన పడకుండా ఉంటామని కూడా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇంకా అలాగే వీటిని తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య కూడా తలెత్తకుండా ఉంటుంది. వీటిలో చాలా ఎక్కువగా ఉండే ఫైబర్ మలబద్దకం సమస్యను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. అలాగే కాబూలీ శనగలను తీసుకోవడం వల్ల ప్రేగుల్లో మేలు చేసే బ్యాక్టీరియా కూడా ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని దీంతో ప్రేగుల్లో రోగనిరోధక వ్యవస్థ చక్కగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: