ప్రోటీన్స్ ఎక్కువగా వుండే వెజ్ ఫుడ్స్?

Purushottham Vinay
ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా ప్రోటీన్స్ కలిగిన ఫుడ్స్ ఎక్కువగా తినాలి. ఇక వేరుశెనగలలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఇంకా ఫైబర్ అధిక మొత్తంలో లభిస్తుంది. వేరుశెనగలను కనుక మన డైట్‎లో చేర్చుకుంటే ఖచ్చితంగా 100 గ్రాములకు 7 గ్రాముల ప్రోటీన్‌ను అందుతుంది. వేరుశెనగను వెన్న, సాస్‌లు స్మూతీస్ వంటి వివిధ రకాల వంటలలో కూడా మనం ఉపయోగించవచ్చు.ఇందులో మాంసాహారానికి సమానంగా ఉండే  ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది.ఇంకా అలాగే చిక్‌పీస్‎ను గార్బన్జో బీన్స్ అని కూడా పిలుస్తారు. ఇందులో ప్రొటీన్ తో పాటు ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. దీనిని ఆహారంలో చేర్చుకుంటే 100 గ్రాములకు 7 గ్రాముల ప్రోటీన్‌ మీకు అందుతుంది. చిక్‌పీస్‌ను హుమ్ముస్ ఇంకా సలాడ్స్ తోపాటు రకరకాల వంటల్లో ఉపయోగించవచ్చు.ఇక హెల్దీ డైట్ ఫాలో అయ్యేవారికి క్వీనోవా చాలా మంచిది. ఇందులో ప్రొటీన్స్, అమైనో ఆమ్లాలు చాలా పుష్కలంగా లభిస్తాయి. ఇవి కండరాలు, ఎముకలు ఇంకా అలాగే చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. 100 గ్రాములకు 8 గ్రాముల ప్రోటీన్‌ను ఇది అందిస్తుంది.


క్వినోవాను అన్నానికి బదులుగా లేదా సలాడ్‌లకు బేస్‌గా తినవచ్చు. రోజుకు ఒకటి నుంచి రెండు కప్పుల క్వినోవాను తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు.ఎన్నో రకాల శాఖాహార ఆహారాలలో కాయధాన్యాలు చాలా ముఖ్యమైన ఆహారం. వీటిలో ప్రొటీన్లు, పీచుపదార్థాలు ఇంకా అలాగే ఇతర ముఖ్యమైన పోషకాలు అధికంగా ఉంటాయి.ఇక 100 గ్రాముల కాయధాన్యాలు తీసుకుంటే 9 గ్రాముల ప్రోటీన్‌ను అందుతుంది. కాయధాన్యాలను సలాడ్లు, సూప్‌లు ఇంకా అలాగే కూరలు వంటి వివిధ రకాల వంటలలో కూడా ఉపయోగించవచ్చు.ఇంకా టోఫు సోయాబీన్‎ల నుంచి తయారు చేస్తారు. సోయాపాలను ఫ్రీజ్ చేస్తే ఇది తయారవుతుంది. చూడాటానికి పనీర్ లాగా ఉంటుంది.దీన్ని రకరకాల వంటల్లో ఉపయోగించవచ్చు. ఇది ప్రోటీన్‎కు చాలా మంచి మూలం. 100 గ్రాముల టోఫు తీసుకుంటే మీకు 8 గ్రాముల ప్రోటీన్‌ను అందిస్తుంది. టోఫును పాన్-ఫ్రైడ్, బేక్ ఇంకా గ్రిల్ లేదా సూప్‌లు స్టైర్-ఫ్రైస్‌లకు వంటి వంటల్లో ఉపయోగించవచ్చు. శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్లు ఈ టోఫు ద్వారా పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: