స్త్రీలకు డెలివరీ తరువాత పొట్ట తగ్గాలంటే..?

Purushottham Vinay
చాలా మంది స్త్రీలకు డెలివరీ తరువాత పొట్ట వస్తుంది.అయితే ఎలాంటి శ్రమ లేకుండా కొన్ని ఆహార నియమాలను పాటించడం వల్ల  పెద్దగా ఉన్న పొట్ట తిరిగి సాధారణ స్థితికి మార్చుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇందుకు స్త్రీలు ప్రసవం అయిన 15 నుండి 21 రోజుల తరువాత పొట్టకు నడికట్టు కట్టుకోవాలి.పొడవుగా ఉండే కాటన్ వస్త్రాన్ని తీసుకుని కింది జారిపోయిన పొత్తి కడుపును పైకి వత్తిపట్టి నడుము చుట్టూ గట్టిగా కట్టుకట్టాలి. ఇలా చేయడం వల్ల సాగిన గర్భాశయం మళ్ళీ సాధారణ స్థితికి చేరుకుంటుంది. ఇంకా అలాగే సాగినా, ఉబ్బిన, వ్యాకోచించిన కండరాలు కూడా తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది. ఇలా బయట నడికట్టును కట్టుకోవడంతో పాటు కొన్ని రకాల ఆహార నియమాలను కూడా ఖచ్చితంగా పాటించాలి. ప్రసవం తరువాత స్త్రీలు వారి ఆహారంలో భాగంగా శొంఠి పొడిని తీసుకోవాలి. శొంఠిని వేయించుకొని పొడిగా చేయాలి. ఆ తరువాత ఇందులో ఉప్పు వేసి కలిపి స్టోర్ చేసుకోవాలి. ప్రతి రోజూ అన్నం తినేటప్పుడు మొదటి ముద్దలో రెండు చిటికెడు ఈ శొంఠి పొడిని వేసుకుని అది మునిగే వరకు నెయ్యి వేసుకుని తినాలి.అలాగే నీటిలో వాము వేసి కాచి చల్లార్చి ఆ నీటిని రోజుంతా తాగడం వల్ల కూడా గర్భాశయం సంకోచిస్తుంది.


అలాగే ప్రసవానంతరం మూడు నెలల దాకా బంగాళాదుంప, బెండకాయ వంటి ఆహారాలను అస్సలు తీసుకోకూడదు. ఇవి ఆరోగ్యానికి మేలు చేసేవే అయినా ఇవి బరువు పెరిగేలా చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ప్రసవం తరువాత ఖచ్చితంగా పిల్లలకు పాలు ఇవ్వాలి. దీని వల్ల కూడా బరువు పెరగకుండా ఇంకా పొట్ట రాకుండా ఉంటుంది. అలాగే బాలింతలకు మొదటిసారిగా స్నానం చేయించేటప్పుడు కొబ్బరి నూనెలో పసుపు కలిపి పొట్టకు బాగా రాస్తూ మర్దనా చేసి ఆ తరువాత వేడి నీటితో పొట్ట మీద గట్టిగా కొట్టడం  వల్ల పొట్ట పెరగకుండా ఉండడంతో పాటు పొట్టపై ఉండే చారలు కూడా ఈజీగా పోతాయి.ప్రస్తుత కాలంలో బాలింతలు బరువు పెరగకుండా ఇంకా పొట్ట రాకుండా రకరకాల వ్యాయామాలు కూడా చేస్తున్నారు. అయితే వారు వీటిని కేవలం నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. లేదంటే ఖచ్చితంగా పలు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇక ప్రసవం తరువాత ఇలా నడికట్టును కట్టుకుంటూ ఈ టిప్స్ పాటించడం వల్ల పొట్ట తగ్గడంతో పాటు బరువు పెరగకుండా కూడా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: