కడుపులో మెలి పెట్టినట్టు ఉందా.. అయితే ఇలా చేయండి..!

Divya
ఇటీవల కాలంలో చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా కడుపునొప్పి అనేది అత్యంత ప్రమాదకరమైన సమస్యగా మారింది. ఒకటి రెండుసార్లు కడుపునొప్పి వస్తే చిన్న చిన్న ఇంటి చిట్కాలు పాటించి నయం చేసుకోవచ్చు. ఒకవేళ కడుపునొప్పి రోజుల తరబడి వస్తే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలి.మనం తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం.. అజీర్తి.. ఎసిడిటీ.. స్పైసీ ఫుడ్స్.. జంక్ ఫుడ్.. ఆయిల్ ఫుడ్స్ వంటివి కడుపు నొప్పికి దారితీస్తాయి.. కాబట్టి కడుపు నొప్పి వచ్చినప్పుడు మనం ఇంట్లో ఉండే చిన్న చిన్న చిట్కాలు పాటించి త్వరగా ఉపశమనం పొందవచ్చు.
మరి కడుపునొప్పి వచ్చినప్పుడు మెడిసిన్స్ కాకుండా ఇంటి చిట్కాలు ఏవి పాటించాలి అనే విషయానికి వస్తే..
గోరువెచ్చని నీరులో ఒకటి లేదా రెండు స్పూన్లు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి ఆ నీరుని తీసుకోవడం వలన స్టమక్ అప్సెట్ నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది.
కడుపు నొప్పిని నివారించడంలో  లెమన్ వాటర్  చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇంకా వికారం మరియు వాంతులు నుండి ఉపశమనం కలిగిస్తుంది. మూడు చెంచాల నిమ్మరసాన్ని ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లలో మిక్స్ చేసి రోజులో మూడుసార్లు త్రాగాలి.
చమోమెలీ టీ  కడుపు నొప్పికి చాలా బాగా ఉపయోగపడుతుంది.ఈ టీ లో కొంచెం నిమ్మరసాన్ని కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది.
వామను చేత్తో నలిపి.. నోట్లో మరొకసారి బాగా నమిలి ఆ రసం మింగడం వల్ల కడుపునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
అలాగే కడుపునొప్పి వచ్చినప్పుడు అరకప్పు పెరుగు తీసుకుని తినడం వల్ల వెంటనే నొప్పి తగ్గుతుంది. ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా కడుపునొప్పిని దూరం చేస్తుంది.
కడుపునొప్పి బాగా ఎక్కువ గా వస్తున్నప్పుడు పుదీనా ఆకులు తినడం వల్ల కూడా మంచి ఉపశమనం ఉంటుంది.ఇలాంటి సమయం లో వైద్యులను సంప్రదించడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: