మీ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. వారికి డయాభేటీస్ సోకినట్టే..!

Divya
ఈ మధ్య కాలంలో 100 కీ 90 శాతం మంది తెలీకుండానే మధుమేహ బారిన పడుతున్నారు.దీనికి కారణం ఆహార అలవాట్లు, మరియు మారుతున్న జీవన శైలి, చెడు అలవాట్లు అని చెప్పవచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లలో ఈ మధుమేహం క్రమంగా పెరుగుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని లక్షణాలు పిల్లలో ముందుగానే పసిగట్టి, తప్పకుండా వైద్యున్ని సంప్రదించాలని సూచిస్తున్నారు. లేకుంటే పిల్లల్లో మధుమేహం స్థాయి పెరిగి, అనేక రోగాలకు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే అలాంటి లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..డయాభేటీస్ లక్షణాలు..
ముఖ్యంగా 5ఏళ్ల లోపు పిల్లలను, వారి ఆరోగ్య పరిస్థితిని గమనిస్తుండాలి. వారికి అధికంగా దాహం వేయడం,మాటి మాటికీ మూత్రవిసర్జనకు వెళ్లడం,
చేతులు మరియు కాళ్ల నొప్పులుగా భావించడం,తరుచు జీర్ణ సమస్యలు ఎదుర్కోవడం,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం,దృష్టి లోపాలు తలేత్తడం,తరచుగా అలసిపోవడం, ఉన్నట్టుండి బరువు తగ్గడం,అతిగా దాహం వేయడం వంటి లక్షణాలు అధికంగా కనిపిస్తుంటే  చికిత్స అందించడం చాలా అవసరం.అలాగే కొన్ని ఆహార నియమాలు పాటిస్తూ,వ్యాయామం, యోగా వంటి శారీరక శ్రమను అలవాటు చేయడం వల్ల మధుమేహాన్ని అరికట్టవచ్చు.
హార్మోన్ మార్పులు..
సాధారణంగా పిల్లలు తీపి పదార్థాలను చాక్లెట్లు మరియు స్వీట్లు ఎక్కువగా తింటూ ఉంటారు.అందువల్ల మధుమేహం ఉన్న పిల్లలు తీపి పదార్థాలను తినకూడదని అర్థం చేసుకునేలా అవగాహనా కల్పించాలి.అందువల్ల,ముఖ్యంగా బాలికలు వయస్సులో ఉన్నప్పుడు వారికీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మరియు షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.
మానసికంగా బలోపేతం చేయడం..
పిల్లలో మధుమేహం బారిన పడినప్పుడు తల్లిదండ్రులుగా  వారిని మానసికంగా స్ట్రాంగ్ అయేలా అవగాహన కల్పించాలి.వారి ఆహారపు అలవాట్లను క్రమబద్ధీకరించడం మరియు ఇన్సులిన్ ఇంజెక్షన్లను గురించి చెబుతూ,వారి  భయందోళనను తొలగించాలి. ఇది తల్లిదండ్రుల యొక్క ముఖ్యమైన కర్తవ్యం.. డయాబెటిస్ ఉన్నపిల్లల శరీరంలో కార్బొహైడ్రేట్స్ లెవెల్స్ స్థిరంగా ఉండేలా చూసుకోవాలి.ఇలాంటి లక్షణాలను ముందే గమనిస్తే తగిన సమయంలో తగిన వైద్య చికిత్స అందించి, వారి ఆరోగ్యాన్ని కాపడుకోవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: