చలికాలం సంపూర్ణ ఆరోగ్యం కోసం ఇలా చెయ్యండి?

Purushottham Vinay
ఇక ఎల్లప్పుడూ కూడా మన ఆరోగ్యాన్ని  కాపాడుకోవడానికి  శరీరంలో రోగనిరోగ శక్తి ఉండడం అనేది చాలా ముఖ్యం.రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే మనం ఎన్నో రకాల వ్యాధులతో బాధపడవలసి ఉంటుంది.అయితే ఈ చలికాలం మొదలవడం వల్ల అంటు వ్యాధులు ఇంకా సీజనల్ వ్యాధులు ప్రజలను చాలా రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీనివల్ల చలికాలంలో జలుబు, దగ్గు ఇంకా అలాగే ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు మనల్ని ఎంతగానో వేధిస్తూ ఉంటాయి. ఈ సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి కొన్ని రకాల జాగ్రత్తలను తప్పకుండా కూడా పాటించాలి. ఈ సమయంలో ఖచ్చితంగా కఠినమైన ఆహార నియమాలను పాటించడం చాలా మంచిది. సీజన్ కు తగినట్లు మన ఆహారపు అలవాటులను మార్చుకోవడం చాలా ముఖ్యం.అలా చేయడం వల్ల మన రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా మన ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది.చలికాలంలో మన రోగనిరోధక వ్యవస్థకు ప్రయోజనకరంగా పనిచేసే కొన్ని రకాల వంటకాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


చలికాలంలో ఆరోగ్యం కోసం రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. ఇక అందుకోసం అల్లం, క్యారెట్స్ చాలా మంచివని చెబుతున్నారు. చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే క్యారెట్ తో పాటు అల్లం లోని గుణాలు కూడా మన శరీరానికి బాగా ఉపయోగపడతాయి.కంటి సంబంధిత సమస్యల నుంచి బయటపడేందుకు కూడా క్యారెట్ లో పోషక గుణాలు చాలా మేలు చేస్తాయి. ఇందులో పుష్కలంగా ఉండే బీటా కేరోటిన్ ఇన్ఫెక్షన్లను దూరం గా ఉంచడంలో చాలా బాగా సహాయపడుతుంది.అల్లం క్యారెట్ సూప్ లో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. జలుబు, దగ్గు ఇంకా అలాగే గొంతు ఇన్ఫెక్షన్ లను కూడా ఇవి ఈజీగా తగ్గిస్తాయి.మూంగ్ దాల్ కొబ్బరి ఇంకా అలాగే కివితో చేసిన సూప్ మన ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.కివిలో ఉండే విటమిన్ సి రోగరోధకశక్తిని పెంచేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మిక్స్డ్ వెజిటేబుల్స్ సూప్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు,మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ సూప్ లో మీకు నచ్చిన కూరగాయలు ఎండుమిర్చి, జీలకర్ర ఇంకా అలాగే కరివేపాకు వేసి సూప్ చేసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: