గ్యాస్, అసిడిటి,మలబద్దకం, పైల్స్ సమస్యలకు చెక్ పెట్టే టిప్?

Purushottham Vinay
మలబద్దకం సమస్య చాలా ప్రమాదకరం. ఎందుకంటే దీనివల్ల వల్ల గ్యాస్, అసిడిటి, ఆకలి వేయకపోవడం, ఫైల్స్, పిషర్స్, తలనొప్పి వంటి ఎన్నో రకాల అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది.అయితే కొన్ని ఈజీ ఇంటి చిట్కాలను పాటించడం వల్ల ఈ సమస్య నుండి మనం చాలా సులభంగా బయట పడవచ్చు.మలబద్దకాన్ని ఈజీగా తగ్గించడంలో త్రిఫల చూర్ణం చాలా బాగా ఉపయోగపడుతుంది. రాత్రి పూట దీనిని మజ్జిగలో కానీ లేదా నీటిలో కానీ కలిపి తీసుకోవడం వల్ల ఉదయాన్నే చాలా సాఫీగా విరేచనం అవుతుంది.  ఇలా మూడు నెలల పాటు వాడిన తరువాత 20 రోజుల పాటు ఖచ్చితంగా విరామం ఇవ్వాలి. ఇలా విరామం ఇచ్చిన 20 రోజుల తరువాత దీనిని వాడడం మళ్ళీ ప్రారంభించాలి. ఈ విధంగా త్రిఫలా చూర్ణాన్ని వాడడం వల్ల మలబద్దకం సమస్య నుండి చాలా ఈజీగా బయట పడవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ఇలా త్రిఫల చూర్ణాన్ని వాడడంతో పాటు అరటి, ఫైనాఫిల్, సపోటా ఇంకా అలాగే నారింజ వంటి పండ్లను కూడా తీసుకోవాలి.ఇంకా అలాగే పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న కూరగాయలను ఇంకా ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి. మసాలాలు, నూనెలో వేయించిన పదార్థాలు, ఇంకా అలాగే ఫాస్ట్ ఫుడ్ వంటి ఆహారాలకు ఖచ్చితంగా కూడా చాలా దూరంగా ఉండాలి. నిల్వ ఉంచిన పచ్చళ్లలను తీసుకోవడం కాఫీ ఇంకా టీ లను తాగడం కూడా తగ్గించాలి. ఖచ్చితంగా సమయానికి ఆహారాన్ని తీసుకోవాలి.ఇంకా అలాగే నీటిని ఎక్కువగా తాగాలి. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల మలం అనేది మృదువుగా తయారవుతుంది. ఇంకా అలాగే చిరుధాన్యాలను ఖచ్చితంగా ఆహారంలో భాగంగా తీసుకోవాలి.ఇంకా అలాగే వ్యాయామం  ప్రతిరోజూ చేస్తూ ఉండాలి. అలాగే ఉదయం పూట ఒక గ్లాస్ నీటిని తాగి కాసేపు అటూ ఇటూ తిరగాలి. ఇలా చేయడం వల్ల పొట్టలో కదలికలు అనేవి పెరుగుతాయి. ఇలా చిన్న చిన్న చిట్కాలను పాటించడం వల్ల మలబద్దకం సమస్య నుండి చాలా ఈజీగా బయట పడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: