లైఫ్ స్టైల్: వర్షాకాలంలో వంటింటి దినుసులు పాడవకుండా ఉండాలంటే..?

Divya
సాధారణంగా వర్షాకాలంలో వాతావరణంలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి సమయంలో ఇంటి నిర్వహణకు ఆడవారు ఎంతో శ్రమించాలి. ఒకవైపు బట్టలు ఆరవు మరొకవైపు పిల్లల కోసం తెచ్చిన బిస్కెట్లు, చాక్లెట్లు, స్నాక్స్, మసాలాలు వంటివి పాడయ్యే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ముఖ్యంగా గాలిలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల ఇలాంటి సమస్య ఎక్కువ అవుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇకపోతే వంటింటి దినసులు, పిల్లలకు కావలసిన స్నాక్స్ పాడవకుండా ఉండాలి అంటే ఈ వర్షాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
ముఖ్యంగా వంటగదిలో ఎప్పుడైనా సరే మీరు తడిగా ఉన్న ప్రాంతంలో బిస్కెట్లు,  ఇతరత్రా స్నాక్స్ తో పాటు మసాలా డబ్బాలను ఉంచకూడదు. ఎందుకంటే వీటిలో ఫంగస్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది . కాబట్టి పొడి వాతావరణంలో మాత్రమే వీటిని నిలువ చేసుకోవాలి. గాలి చొరబడని గాజు పాత్రలలో మాత్రమే మీరు ఆహార పదార్థాలను నిల్వ ఉంచితే చాలా మంచిది. వీటివల్ల గాలి లోపలికి వెళ్లలేక ఆహార పదార్థాలు చెడిపోయే అవకాశం ఉండదు. ప్లాస్టిక్ డబ్బాలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆహారాన్ని నిల్వ ఉంచకండి.. సాధ్యమైనంత వరకు డబ్బాలలో ఆహార పదార్థాలు నిల్వ చేయాలనుకుంటే తేమ లేకుండా పొడిగా ఉన్న వాటిలోనే ఆహారాలను నిల్వ చేయాలి.
ఇక ఆహార పదార్థాలను ఎల్లప్పుడూ కూడా ప్రత్యేక కంటైనర్లలో ఉంచడం తప్పనిసరి. అంతేకాదు అదే కంటైనర్ ను మరో పాత్రలో ఉంచకూడదు. మీకు మసాలాలు,  బిస్కెట్లు అయిపోయినప్పుడు ఆ పాత్రను శుభ్రంగా కడిగి ఆరబెట్టిన తర్వాత మరొకసారి మీరు కంటైనర్ లో ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవచ్చు. ఇక ఫుడ్ ప్యాకెట్ ని తెరిచి సగం అలాగే ఉంచకూడదు. ప్యాకెట్ లోని ఆహారాన్ని గాలి చేరబడి డబ్బాలో వేయడం మంచిది. ఇక ఇలా మీరు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ వర్షా కాలంలో ఎక్కువగా ఆహారాలు చెడిపోయే అవకాశం ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: