లైఫ్ స్టైల్: తల్లులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

Divya
30 - 40 సంవత్సరాల మధ్య వయసున్న తల్లులు పోషకాహార లోపం.. ఎముకల బలహీనత.. ఎర్ర రక్త కణాల లోపం వంటి అనేక రకాల వ్యాధులతో బాధపడుతున్నారు. తల్లులు ఇంట్లో పిల్లల కోసం , భర్త కోసం , అత్త మామ కోసం మాత్రమే వంట చేస్తారు .. ఇక వారి ఆరోగ్యంపై ఏ మాత్రం కూడా శ్రద్ధ చూపరు అనే విషయం వాస్తవం అనే చెప్పాలి. తమ ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోరు కాబట్టే ఇలాంటి అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఇక తమ పై శ్రద్ధ పెట్టకుండా పూర్తి శ్రద్ధ ఇంట్లో వాళ్ళ పై పెట్టడం వల్ల వీరు ఇలాంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తోంది.
రాబోయే కాలంలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి మన ఆరోగ్యం మనమే కాపాడుకోవడం చాలా మంచిది. 40 సంవత్సరాల వయసు దాటిన తర్వాత మహిళలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయం గురించి ఓ సారి తెలుసుకుందాం.
ఆకుపచ్చ కూరగాయలు, తాజా పండ్లు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పాలకూర , ఆకు కూరలు వంటివి తినడం వల్ల క్యాల్షియం, విటమిన్-ఎ, విటమిన్-సి, ఐరన్ వంటి పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. వీటి వల్ల ఎముకలు దృఢంగా మారడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. వారానికి మూడు సార్లు పచ్చి పండ్లు , పాల కూర , పచ్చి కూరగాయలు వంటివి తీసుకోవడం తప్పనిసరి. జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేసుకోవాలి  అంటే కొబ్బరి నూనెను వంటలో ఉపయోగించాలి. కడుపు సంబంధిత సమస్యలకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. వయసు పెరిగేకొద్దీ రోగనిరోధక శక్తి తగ్గుతుంది . కాబట్టి కొబ్బరి నూనెలో విటమిన్ ఇ అనవసరమైన కొవ్వును తగ్గించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కాపాడుతుంది.
ఫైబర్ అధికంగా లభించే క్వినోవా,  తృణధాన్యాలు,  ప్రోటీన్ ఫుడ్, గ్రీన్ టీ లాంటివి ఆహారంలో ఒక భాగం చేసుకుంటే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: