ఆ కవలలకు 2 తలలు, 4 చేతులు, 2 కాళ్లు.. విధిని ఎదిరించారు..!

వాళ్లు వింత కవలలు.. ఒకరా.. ఇద్దరా అని తేల్చి చెప్పడం కష్టం.. ఎందుకంటే వాళ్లకు రెండు తలలు ఉన్నాయి.. అందుకే ఇద్దరని చెప్పొచ్చు.. అలాగే ఇద్దరికీ రెండు చేతులు కూడా ఉన్నాయి.. కానీ.. ఇదంతా భుజం వరకే.. ఆ తర్వాత కింద శరీరం అంతా ఒక్క మనిషి లాగానే ఉంటుంది. అంటే.. ఇద్దరికీ ఒకటే ఉదరం.. అలాగే ఇద్దరికీ కాళ్లు రెండే.. కవలలు.. అందులో అవిభక్త కవలలను చాలా మందిని చూశాం.. మన హైదరాబాద్‌లోనూ వీణావాణి ఇలాగే ఉంటారు.. కానీ వాళ్లకు శరీర అవయవాలన్నీ వేరు వేరుగా ఉంటాయి.. తలలు మాత్రమే అతుక్కుని పుట్టారు.

కానీ ఈ పంజాబీ కవలలు అలా కాదు.. వీరిది.. పంజాబ్ లోని అమృత్ సర్. వీరి పేర్లు సోనా సింగ్, మోనా సింగ్. చిన్నప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు పడిన వీరు ఇప్పుడు ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు. ఎలాగంటే.. వీరికి పంజాబ్ విద్యుత్ శాఖ ఉద్యోగం ఇచ్చింది. ప్రస్తుతం వీరిద్దరూ పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగం చేస్తున్నారు. సబ్ స్టేషన్ లో ఆర్టీఎంగా పని చేస్తున్నారు. నెలకు రూ. 20 వేల వేతనం ఇస్తారు.

వీరు ఇద్దరే అయినా ఒక వ్యక్తి కిందే లెక్క.. కాకపోతే.. ఇద్దరూ ఒకే సమయంలో రెండు వేరు వేరు పనులు చేయగలరు. అవిభక్త కవలలైన వీరికి అందరు మనుషుల్లానే రెండు చేతులు, తల ఉన్నాయి. కానీ కాళ్లు మాత్రం రెండే ఉన్నాయి. అందువల్ల ఇద్దరూ ఒక్కచోటే ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే..  ఒకే శరీరం ఇద్దరు మనుషులు.. చిన్నప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న వారు కష్టాలకు ఎదురీది ముందుకు సాగుతున్నారు.  

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగిన మోనా, సోనా సింగ్‌లు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించారు. ఈ ఉద్యోగం పొందినందుకు చాలా సంతోషంగా ఉన్నామంటున్న ఈ కవల సోదరులు.. డిసెంబర్ 20న ఉద్యోగంలో చేరారు. ఈ అవకాశం ఇచ్చిన పంజాబ్ ప్రభుత్వానికి, చదువు నేర్పిన పింగిల్వాడా సంస్థకు కృతజ్ఞతలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: