వామ్మో...ఇదేమి ఆచారం రా బాబు..!!!

NCR

ఆచారాలు సాంప్రదాయాలు ఒక్కో దేశానికి ఒక్కోలా ఉంటాయి. ముఖ్యంగా భారత్ వంటి దేశంలో ఆచార సాంప్రదాయాలు అత్యంత అధికంగా ఉంటాయి. భారత్ తరువాత ఆఫ్రికా వంటి దేశాలలో ఈ ఆచార వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి. అయితే చాలా చోట్ల కొన్ని కొన్ని ఆచారాలు ఇబ్బందికరంగా ఉంటే, మర్కొన్ని చోట్ల మాత్రం భయాన్ని గొల్పే విధంగా ఉంటాయి.

 

ఇండియాలో 700 ఏళ్ళుగా ముస్లిమ్స్ పాటిస్తున్న ఓ ఆచారం ఎంతో ప్రాచుర్యాన్ని సంపాదించుకుంది. అదేంటంటే. పుట్టిన పిల్లలని మసీద్ పైకి తీసుకువెళ్తారు. అక్కడి నుంచీ కిందకి పడేస్తారు. ఈ క్రమంలో క్రింద కొంతమంది వ్యక్తులు దుప్పట్లతో పిల్లలని పట్టుకుంటారు. ఆ బాబు కిందకి పడిపోకుండా ఉంటే దేవుడు చల్లగా జీవితాంతం చూస్తాడని, కిందకి పడిపోతే ఏదో అనర్ధం జరుగుతుందని వారి నమ్మకం.. ఈ భయాన్ని గోలోపే ఆచారం  చూస్తే కళ్ళు గిర్రున తిరుగక మానవు. ఇక మరింత భయాన్ని గొలిపే ఆచారం ఒకటి ఉంది..

 

ఈ ఆచారాన్ని తలుచుకంటే మనం ఆ దేశంలో, ఆ ప్రాంతలో పుట్టనందుకు తెగ సంబర పడుతాం. ఇంతకీ ఏమిటా ఆచారం అంటే. పుపువా న్యూగినియా దేశంలో మగవారు, లేక ఆడవారు కానీ తమకి బాగా కావాల్సిన వ్యక్తులు, ఎంతో ఇష్టంగా చూసుకున్న వ్యక్తులు చనిపోతే వారికి గుర్తుగా బ్రతికున్న వ్యక్తుల చేతి వేలుని చనిపోయిన వారికోసం అంకితం ఇస్తారు. ఆ ప్రాంతలో చాలా మంది ఆదివాసీలు చాలా మందికి చేతి వేళ్ళు లేకుండా తెగిన వేళ్ళతో కనిపించడం సర్వ సాధారణంగా కనిపిస్తుంది. కేవలం వేలికి ఉన్న గోరు పై చిన్న చర్మం ఊడిపోతేనే మనం విలవిలలాడుతాం. అలాంటిది చేతి వేళ్ళు నరికేసుకోవడం అంటే మాటలా తలుచుకుంటేనే ఒళ్ళు జలజరిస్తుంది.  అయితే ఇదొక్కటే కాదు ఇలాంటి ఎన్నో భయంకరమైన ఆచారాలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: