బిడ్డ నిద్రలో ఉలిక్కి పడుతుందా? ఇది కారణం కావచ్చు..!

Satvika
పసిపిల్లలు చిన్న శబ్దం వచ్చినా కూడా ఉలిక్కి పడతారు. వారి చెవులు చాలా సున్నితంగా ఉంటాయి. పెద్ద శబ్దాలను వింటే భయం తో గుక్క పెట్టి ఏడుస్తారు. నిద్ర ఉండగా ఒక్కోసారి ఉలిక్కి పడి లేస్తారు. ఇలా లేవడానికి చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. తినే ఆహారం సరిగ్గా లేకున్నా లేదా వారి ఆహారం లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలిసి ఉంటుంది. ఇప్పటినుండి మనం ఇచ్చే ఆహారం బిడ్డ ఎదుగుదలకు కారణం అవుతుంది.

పి
ల్లలు నిద్రపోయే సమయంలో వారి చుట్టూ సపోర్ట్ గా ఏదైనా బరువును పెట్టాలి.లేకుంటే పిల్లలు నిద్రలో ఉలిక్కి పడతారు. ఆకలితో పడుకోవడం వల్ల పొట్ట నిండుగా లేకున్నా సడెన్ గా పొట్టలో నొప్పి రావడం తో బాగా ఏడుస్తారు.. అందుకే వాళ్ళకు బాగా పాలు తాపించి పడుకోబెట్టాలి.సరిగ్గా స్నానం చేయకపొతే బిడ్డకు సగం నిద్ర ఉంటుంది. అంతేకాదు తల్లి ఆరోగ్య కరమైన ఆహారాన్ని తీసుకోవాలి.. పాలు పడే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.. అప్పుడే బిడ్డకు పాలు సరిపడా ఉంటాయి. తగు జాగ్రత్తలు తీసుకోవాలి.. అప్పుడే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది.

ఇక బిడ్డకు ఎటువంటి ఆహారాన్ని ఇవ్వాలి అనేది ఒకసారి చూద్దాం..మొదటి మూడు నెలలు తల్లి పాలు లేదా ఫార్ములా మిల్క్ ను మాత్రమే పట్టాలి. అప్పటివరకూ నీళ్ళు కూడా తాపించకూడదు. తల్లి పాలు కాకుండా ఇతర ద్రవాలు ఇస్తే పిల్లలకు అజీర్తి చేసి ఆరోగ్య సమస్యలు, పోషకాహార లోపం వంటి సమస్యలు వస్తాయని నిపునులు అన్నారు. ఐదు నెలలు నిండాక కొద్ది కొద్దిగా ఆహారాన్ని ఇవ్వాలి.క్యారెట్, అరటి పండ్లు కొద్ది కొద్దిగా పెడుతూ వుండాలి. అప్పుడే పిల్లలకు అన్నీ అహారాలు అలవాటు అవుతాయి.సెరిలాక్ వంటి ఆహారం పెట్టాలనుకున్నప్పుడు బిడ్డకు జీర్ణించుకొనే సామర్థ్యం ఉంటేనే ఒక చెంచాడు సెరిలాక్ పెట్టడం తో మొదలుపెట్టి నెమ్మదిగా పెంచాలి.పొషకాలు ఉన్న ఆహారాన్ని ఇవ్వాలి. దాని గురించి డాక్టర్ ను సంప్రదించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: