బుడుగు: పిల్లలకు ఈ ఆహారం తినిపిస్తున్నారా..?

N.ANJI

చిన్నపిల్లల ఆహారం విషయంలో తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్త వహిస్తారు. మంచి హెల్తీ ఫుడ్ అందించాలని తాపత్రయ పడుతుంటారు. అయితే చాలా మంది తల్లిదండ్రులకు తమ పిల్లలకు ఎలాంటి ఆహారాన్ని ఇవ్వాలనే విషయంపై స్పష్టత ఉండదు. అయితే పిల్లలకు ఏది పడితే ఆ ఫుడ్ పెట్టకూడదు. ప్రత్యేకంగా నూనెలో వేయించిన పదార్థాలను అసలు తినిపించకూడదు. అయితే నూనెలో వేయించిన పదార్థాలను తీసుకోవడం వల్ల ఎన్నో అనర్థాలు ఉంటాయి.


మారుతున్న కాలానుగుణంగా మార్కెట్‌లో జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్స్ రెస్టారెంట్లు వెలిశాయి. పిల్లలు చాక్లెట్లు, బిస్కెట్లు, చిరుతిళ్లతో అలవాటు పడ్డారు. దీంతో పిల్లలకు ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. కానీ తల్లిదండ్రులు వాటిని పట్టించుకోవడం లేదు. ఫలితంగా పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. అయినా తల్లిదండ్రుల్లో నిర్లక్ష్యమే కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.


చిన్నపిల్లలు అడిగిందే తడవుగా.. తల్లిదండ్రులు ఏదీ కొనివొద్దు. తల్లిదండ్రులు తీసుకునే ఆహార పదార్థాలపై పిల్లలకు ఎలాంటి ప్రభావం పడుతుందో ముందే తెలిసి ఉండాలి. ఆహార పదార్థాలు కొనే సమయంలో కొంచెం సేపు ఆలోచించి పదార్థాల ఎంపిక చేసుకోవాలి. చక్కెర పదార్థాలు ఎక్కువగా ఉండే చాక్లెట్లు, తీపి పదార్థాలను తీసుకోవద్దు. దీంతో పిల్లలకు కొవ్వు పెరుగుతుందని తెలుసుకోవాలి. ఎలాంటి ఫుడ్ అయినా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే ప్లాన్ చేసుకోండి. కానీ మార్కెట్‌లో ఉండే ఆహార పదార్థాలకు ప్రియారిటీ ఇవ్వొద్దని గుర్తుంచుకోవాలి.


అయితే చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు మారం చేస్తున్నారని, వాళ్ల గోల భరించలేక ఏది పడితే అది కొనేస్తుంటారు. అయితే ఇది చాలా ప్రమాదకరమైనది. బయట ఫుడ్స్ పిల్లలకు మేలు కంటే చేటు ఎక్కువగా చేస్తాయని తెలుసుకోవాలి. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసినా.. ఒకసారి తింటే ఏమవుతుందనే నిర్లక్ష్య ధోరణిని వదులు కోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆహార పదార్థాలు తినడం వల్ల పిల్లలకు ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని గ్రహించాలంటున్నారు. ఎక్కవ రోజులు నిలువ ఉంచే ఆహార పదార్థాలు ఎంతో డేంజరస్. వీటిని కొనుగోలు చేసే బదులు.. ఇంట్లోనే ఫ్రెష్‌గా కుక్ చేసుకోవడం మంచిదని నిపుణుల అభిప్రాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: