బాల భారతం: లక్ష్యాలు లేని ప్రయాణం?

praveen
బాల్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మరువలేని జ్ఞాపకం.. ఇక నేటి రోజుల్లో ఉద్యోగం వ్యాపారం చేస్తూ పెరిగి పెద్దయిన వారు మళ్లీ బాల్యం ఒకసారి తిరిగి వస్తే బాగుండు అని కోరుకోని వారు లేరు అని చెప్పాలి. ఎందుకంటే వాళ్లు వీళ్లు అనే తేడా లేదు సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు కూడా ప్రతి ఒక్కరికి బాల్యం ఎంతో అపురూపమైనది. అయితే  నేడు ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తూ ప్రయోజకులుగా మారిన వారు ఒకప్పుడు బాల్యంలో ఎన్నో కలలుగని ఉంటారు. ఒక్కసారి అలా బాల్యాన్ని గుర్తు చేసుకుంటే మనసు ఆనందంలో మునిగిపోతు ఉంటుంది. ముఖ్యంగా స్కూల్ దశలో క్లాస్ జరుగుతున్న సమయంలో క్లాస్ టీచర్ మీరు పెద్దయ్యాక ఏం కావాలి అనుకుంటున్నారు అని అడిగిన ప్రశ్న ఇప్పటికీ ప్రతి ఒక్కరికి గుర్తుండే ఉంటుంది.

  చాలామంది ఈ ప్రశ్న తమకు ఎప్పుడు ఎదురు అవుతుందా  అని ఎదురు చూసే ఉంటారు. ఎందుకంటే తాము భవిష్యత్తులో సాధించాలి అనుకుంది అందరి ముందు గర్వంగా చెప్పాలని అనుకుంటూ ఉంటారు. ఇలా ఎప్పుడైనా టీచర్ మీరు పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నారు అంటూ అడిగితే.. నేను డాక్టర్ కావాలనుకుంటున్నాను టీచర్.. నేను ఇంజనీర్ అవ్వాలి అనుకుంటున్నాను టీచర్.. నేను ఒక గొప్ప సైంటిస్ట్అవుతాను టీచర్ అంటూ ఎంతో హుషారుగా ఒక్కో విద్యార్థి ఒక్కో ఈ విధంగా తమ భవిష్యత్తు లక్ష్యాన్ని బయటపెట్టేవారు. ఇలా అవ్వాలి అనుకోవడమే కాదు అవ్వడానికి లక్ష్యం వైపు  అడుగులు వేసే వారు.

 కానీ ఇప్పుడు ఎక్కడ అలాంటివి కనిపించడం లేదు. మార్కుల కోసం పోరాటం ర్యాంకుల కోసం ఆరాటం తప్ప.. అసలు చదువు ఎందుకు కొనసాగిస్తున్నాం భవిష్యత్తులో ఏం కావాలి అనుకుంటున్నాం అన్న క్లారిటీ మాత్రం నేటి రోజుల్లో పిల్లల్లో కనిపించడం లేదు. బట్టీ పట్టే చదువులు తప్ప.. భావి భారత పౌరులను తీర్చిదిద్దే చదువులు నేటి రోజుల్లో ఎక్కడా కనిపించడం లేదు. ఇక నేటి రోజుల్లో పిల్లలను పెద్దయ్యాక మీరేం కావాలనుకున్నారు అని అడిగితే.. అదేదో క్లిష్టమైన ప్రశ్న అడిగినట్లుగా తడబడి పోతున్నారు తప్ప.. భవిష్యత్తులో నేను ఇది కావాలనుకుంటున్నాను.. తప్పకుండా అవుతాను అని మాత్రం చెప్పే కాన్ఫిడెన్స్ నేటి పిల్లల్లో ఎక్కడా కనిపించడం లేదు. ఇలా లక్ష్యాలు లేనిచదువులు నేటి భవిష్యత్తు భావి భారతాన్ని ఎక్కడ తీసుకెళ్తాయో అన్నది మాత్రంఅందరికీ ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: