బుడుగు: మానసిక రుగ్మతతో బాధపడుతున్న చిన్నారులు

N.ANJI

మానసిక ఆరోగ్య సమస్యలు అందరికీ సాధారణంగా వస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడుగురు చిన్న పిల్లల్లో ఒకరికి మానసిక సమస్య ఉంటుంది. ఈ సమస్య కోవిడ్, లాక్‌డౌన్ కారణంగా తీవ్రతరం అయిందని యునిసెఫ్ వెల్లడించింది. ఈ సమస్యపై భారత ప్రతినిధి డాక్టర్ యాస్మిన్ అలీ హక్ స్పందించారు. ఈ మేరకు ఈ సమస్యను చిన్నపిల్లల్లో గుర్తించామన్నారు. చిన్నపిల్లల పరివర్తనపై తల్లిదండ్రులు ఎల్లప్పుడూ గమనిస్తుండాలన్నారు. పిల్లలతో ఫ్రెండ్లీగా మాట్లాడుతూ.. వారి ఆలోచనలు షేర్ చేసుకుంటే మానసిక సమస్యలు తలెత్తవన్నారు. ఎలాంటి సమస్యలున్నా పిల్లలతో ఫ్రెండ్లీగా మాట్లాడితే.. సమస్యను గుర్తించి చికిత్స చేయడం సులభం అవుతుందన్నారు.

 

కోవిడ్ ప్రభావం పిల్లలపైనే కాకుండా పెద్దవారిపై పడింది. సంక్షోభంలో ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం వల్ల మానసిక సమస్య ఎక్కువయ్యాయి. ఈ లక్షణాలు కొందరిలో ఆలస్యంగా బయట పడ్డాయి. చాలా మంది పిల్లలు కరోనా సమయంలో మానసిక ఆందోళనకు గురయ్యారని వైద్యులు తెలిపారు. ఇలాంటి పరిస్థితే కొనసాగితే పిల్లలకు ప్రమాదమని వారు హెచ్చరించారు. చిన్న పిల్లలు, యుక్త వయసు వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని, కరోనా థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదముందని, ఈ సమస్యపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు.


ఈ సందర్భంగా యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రిట్టా ఫోర్ మాట్లాడారు. దేశవ్యాప్తంగా కరోనా లాక్‌డౌన్ ఆంక్షల విధించడం జరిగిందన్నారు. దీని వల్ల కుటుంబం, చిన్నపిల్లలు ఇళ్లకే పరిమితమయ్యారని పేర్కొన్నారు. స్నేహితులు, ఆటలు, తరగతులకు దూరమయ్యారని అన్నారు. అయితే ఈ సమస్య కరోనా రాకముందే చాలా మంది పిల్లల్లో ఎక్కువగా ఉందన్నారు. అయితే లాక్‌డౌన్ కారణంగా ఈ సమస్య మరింత ఎక్కువ అయిందన్నారు. చిన్నపిల్లలు మానసికంగా ఆందోళన గురైనప్పుడు తల్లిదండ్రులు అండగా నిలబడాలన్నారు. ప్రతి విషయాన్ని షేర్ చేసుకునే ఉండాలన్నారు. అప్పుడే మానసిక రుగ్మతలు తగ్గే అవకాశాలు ఉన్నాయని వైద్యులు పేర్కొన్నారు. పిల్లలతో టైం స్పెండ్ చేయడం, ఆటలాడటం, వారికి మంచి మంచి స్టోరీ చెప్పడం చేస్తుండాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: