ఓరి దీని వేషాలోయ్..ఒకే ఒక్క పనితో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఇమ్మాన్వి ఇస్మాయిల్..!
ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ ని మనం చాలా డిఫరెంట్ లుక్ లో చూడబోతున్నామట. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్గా కొత్త అమ్మాయి ఇమాన్వి ఇస్మాయిల్ చూస్ చేసుకున్నారు హనురాఘవపూడి . ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా చాలా గ్రాండ్ గా కంప్లీట్ అయ్యాయి . కాగా అసలు ఇంతవరకు తెరపై ఒక్క సినిమాలో కూడా కనిపించని ఈ హీరోయిన్ కి ఇంత పెద్ద సినిమాలో అవకాశం రావడమే గొప్ప విషయం అనుకుంటున్న మూమెంట్లో ఈ సినిమా అసలు రిలీజ్ కాకముందే ఆమె ఖాతాలో మరో బడా హిట్ అయ్యే సినిమా వచ్చి చేరడం సంచలనంగా మారింది .
అందుతున్న సమాచారం ప్రకారం మైత్రీ మూవీ మేకర్స్.. ఈమెతో ఫౌజీ కంప్లీట్ అయ్యేవరకు ఏ సినిమాకి కూడా కమిట్ అవ్వకూడదు అనే విధంగా అగ్రిమెంట్ రాయించుకుంది అంటూ గతంలో వార్తలు వినిపించాయి . అయితే ఫౌజీ కంటే ముందే అగ్రిమెంట్ పై సైన్ చేసిన ఎక్కడ కూడా కాల్ షీట్స్ మాత్రం ఇవ్వకూడదు..ఫౌజీ తర్వాత ఇవ్వాలి అంటూ తాజాగా అగ్రిమెంట్ ని సవరించిందట. ఇప్పుడు టి సిరీస్ అధినేతలు ఇమాన్వి కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట.
కార్తీక్ హీరోగా అనురాగ డైరెక్షన్లో భారీ రొమాంటిక్ సినిమాని ప్లాన్ చేశారు ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ అంటూ తెలుస్తుంది . అయితే ఫౌజికి సైతం ఈయన ఒక నిర్మాతగా ఉన్నారు. కాగా ఈయనే సందీప్ రెడ్డివంగా - ప్రభాస్ స్పిరిట్ సినిమాకు మెయిన్ ప్రొడ్యూసర్ కూడా . ఆది పురుష్ మూవీకు ఎంత బడ్జెట్ పెట్టారో కూడా చూసాం. అలా ఈ బాండింగ్ ని వాడుకొని ఇప్పుడు లాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారట . అంతేకాదు ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతూ ఇమ్మాన్వి ఇస్మాయిల్ పేరు మారు మ్రోగిగిపోతుంది . అదేదో సామెత చెప్పినట్లు ఇమ్మాన్వీ నక్క తోక తక్కినట్లే ఉంది . లేకపోతే అసలు తెరపై ఆమె ఎలా నటిస్తుందో తెలియదు కానీ పెద్ద పెద్ద బడా సంస్థలు మాత్రం ఇంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అంటూ ట్రోలింగ్ కూడా చేస్తున్నారు . మరి కొంతమంది ప్రభాస్ అన్నతో ఓపెనింగ్ నీ లైఫ్ ఇక బిందాస్ అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!