బుడుగు: పిల్లలకి డెంగీ ఫివర్‌ రాకుండా ఇలా చేయండి..??

N.ANJI
వర్షకాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ సీజనల్ లో దోమ కారణంగా మాలేరియా, డెంగీ, వైరల్ జర్వాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సీజనల్ సమయంలో పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఇక ముఖ్యంగా ఈ మస్కిటో ఫ్రేష్‌ వాటర్‌ లోనే స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఇంటి పరిసరాల్లో కొబ్బరి చిప్పలు, పాత టైర్లు ఇతర స్టోరేజీ కంటైనర్లలో వాటర్‌ నిల్వ ఉండకుండా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలా కాకుండా వాటిపై మూత పెట్టి ఉండేలా చూసుకోవాలని అన్నారు.
సాధారణంగా దోమలు దోమలు మన శరీరం నుంచి విడుదలయ్యే కార్బన్‌ డై ఆక్సైడ్‌ ద్వారా గుర్తిస్తాయని నిపుణులు చెబుతున్నారు.ఇక పిల్లలకు డెంగీ ఫీవర్‌ అనగానే తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతుంటారు. డెంగీ బారినపడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక రక్తంలో ప్లేట్‌ లేట్స్‌ సంఖ్య తగ్గకుండా ఉండాలని అన్నారు.
అయితే పిల్లలు ఆడుకునేటపుడు లేదా ఇంట్లో ఉన్నా.. మస్కిటో రెప్పలెంట్‌ అప్లై చేసి ఉంచాలని అన్నారు. ఇక దోమల తెర కూడా వాడితే మరింత మంచిదని అంటున్నారు. అంతేకాక.. రెండు నెలలపైబడిన పిల్లలకు మాత్రమే మస్కిటో రెప్పలెంట్‌ అప్లై చేయాలని అంటున్నారు. ఇక ముఖ్యంగా డీట్‌ ఉంటే మస్కిటో రెప్పలెంట్‌ వాడటం మంచిదని అంటున్నారు.
ఇక ఉదయం మస్కిటో రెప్పలెంట్‌ అప్లై చేస్తే సాయంత్రం వరకు పిల్లలకు ప్రొటెక్షన్‌ ఇస్తుందని అన్నారు. అలాగే లెమన్, యూకలిప్టస్‌ ఆయిల్‌ నేచురల్‌ రెప్పలెంట్స్‌. సిట్రనల్‌ ఆయిల్‌ బేస్‌ ఉన్న మస్కిటో రెప్పలెంట్స్‌ మార్కెట్లో ఎక్కువగా అందుబాటులో ఉంటాయని చెప్పుకొచ్చారు. అంతేకాక.. ఒడోమస్‌ వంటివి 3 ఏళ్లు పైబడిన పిల్లలకు మాత్రమే వైద్యులు సిఫార్సు చేస్తుంటారని అన్నారు. అయితే ఈ నేచురల్‌ ప్రొడాక్ట్స్‌ అన్ని 4–6 గంటలు మాత్రమే ప్రొటెక్షన్‌ ఇస్తాయని ఆరోగ్య నిపుణులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: