చెప్పాండంటే ...: కోవిడ్ బాధితులకు కొండంత భరోసా
అమ్మ లేరు నాన్న కూడా లేరు
జీవితాన అలుముకున్న
చీకటి పోయేలా లేదు
ఆదుకున్న ఆపన్న హస్తం
సాయం అందిస్తుందన్న నమ్మకం
ఆ చిన్నారుల జీవితంలో
శ్రీరామ రక్ష అయింది
ఆ వివరాలివి..
.................ఆ సాయం
సహృదయతకు సంకేతం
చిన్నారులంతా ఒంటరి అయిపోయిన రోజు..చిన్నారులంతా తమ బాధను ఎవ్వరితోనూ పంచుకోని రోజు.. తల్లీ తండ్రీ లేరన్న మాటలు వినపడిన రోజు..ఇకపై రాకూడదు..ఇలా అనుకోండి. లేదా అలాంటి ఒంటరి ప్రాణాలకు మీరు అండగా ఉండండి. డబ్బులు ఉన్నా లేకున్నా మీ మానవీయ పలకరింపు వారిలో జీవితంపై కొత్త ఆశలు చిగురింపజేస్తుంది.అమ్మానాన్నై ఈ సమాజం నడిపితే ఆ బిడ్డలు తెచ్చే విజయాలు మంచి సమాజ నిర్మాణానికి తోడ్పాటు అందిస్తాయి. రండి! కష్టం ఎవ్వరిది అయినా స్పందించే గుణం మాత్రం అందరిదీ అని చాటుకోవడం సిసలు సహృదయతకు సంకేతం అని నిరూపిద్దాం. ఆ పని కాస్తయినా ఎవ్వరు చేసినా అభినందిద్దాం. ఇదిగో రాష్ట్ర ప్రభుత్వం చేసిన మంచి పని కారణంగా నలుగురు చిన్నారులు ప్రయోజకులు అయ్యేందుకు ఉపకారం అందింది. ఆ ఉపకారం కారణంగా వారి చదువులు ఆగవు. అలానే మరికొన్ని రోజులు వారు హాయిగా జీవించవచ్చు.
పెరిగి పెద్దయ్యాక మీరు బాధ్యతగా ఉంటే ఈ దేశం గర్విస్తుంది. ఈ రాష్ట్రం ఆనందిస్తుంది అని ఆ జిల్లా కలెక్టర్ అన్నది ఇందుకే...
మోడు వారిన జీవితాలకో ఆసరా
తల్లీ తండ్రీ అన్నీ తానై నిలిచిన ప్రభుత్వం
కరోనా కారణంగా బిడ్డలను కోల్పోయిన తల్లులు, తల్లీ తండ్రీ మృత్యువాత పడడంతో రోడ్డున పడ్డ బిడ్డలు ఇలా ఎందరెందరో! ఈ స మయంలో వారికో భరోసా లేక బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న ఆ చిన్నారులను మా నవతా దృక్పథంతో ఆదుకున్న వై నం కడప జిల్లాలో నెలకొంది. కలెక్టర్ చొరవతో ఆయా కుటుంబాలకు ఆర్థిక భరోసా దక్కింది. వివరాలిలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్ సర్కారును ఆర్థిక లోటు వెంబడిన్నప్పటికీ కొన్ని జీవితా ల్లో సంతోషాలు నింపేందుకు చేస్తున్న ప్రయత్నం మాత్రం ఆ గడం లేదు. కరోనా కారణంగా రోడ్డున బడిన జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఆశయం మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలో కడప జిల్లా కలెక్టర్ కరోనా బాధిత కుటుం బాలకు అండగా నిలిచారు. కరోనా కారణంగా తల్లీ తండ్రీ కోల్పోయిన నలుగురు చిన్నారులకు ప్రభుత్వం మాట్లాడి సాయం అందించేలా ఏర్పాటు చేశారు. ఒక్కో చిన్నారికి పది లక్షల రూపాయల చొప్పున వారి అకౌంట్ల లో ఫిక్స్డ్ డిపాజి ట్లు చేశారు. దీంతో వారి జీవితాల్లో ఆనందం వెల్లి విరుస్తోంది. కోవిడ్ కారణంగా తల్లీ తండ్రీ కోల్పోయి నిరాశ్రయులయిన బిడ్డలకు ఇదే విధంగా చేయూత ఇస్తామని కలెక్టర్ విజయ రామరాజు తెలిపా రు.