బుడుగు: ఏడాది వయసున్న పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వండి..!?

N.ANJI
ఏడాది వయసు పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి. వారి ఫుడ్ డైట్ లో తప్పనిసరిగా ఉంచాల్సిన ఐటమ్స్ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. ఎదిగే వయసు పిల్లలకు ఆహారం సరిపడా ఇవ్వాలి. తల్లిపాలు అన్నిటికన్నా శ్రేష్టం. ఒకవేళ అవి సరిపోక పోతే విడిగా పాలు ఇవ్వాల్సి ఉంటుంది. శరీరంలో భాగాలు అప్పుడే వృద్ధి చెందుతూ ఉంటాయి కాబట్టి కాల్షియం చాలా అవసరం. ఎముకలకు, దంతాలకు సరిపడా క్యాల్షియం అందేలా చూసుకోవాలి.
శరీరం పూర్తిగా ఫామ్ అవటంలో కండరాలతో పాటుగా ఎముకలకూ అంతే ప్రాధాన్యం ఉంది. పాలు రోజు పిల్లకు ఇవ్వాలి. కొందరు పిల్లలకు పాల వల్ల అలర్జీ ఉంటుంది. అటువంటి పిల్లలకు సోయామిల్క్, క్యాల్షియంతో కూడిన ఫ్రూట్స్ జ్యూస్ ఇవ్వాలి.  
పీచు పదార్థాలు చాలా అవసరం. పిల్లలకు ఇచ్చే ఆహారంలో పీచు పదార్థం సరిపడా ఉండేలా చూసుకోవాలి. ఇక ఫ్యాట్ విషయానికి వస్తే..పిల్లలకు ఫ్యాట్ అవసరం. ఎక్కువ ఫ్యాట్ ఉన్న ఆహారం ఇవ్వటం కూడా మంచిది కాదు. లేని పోని సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి తగినం ఫ్యాట్ మాత్రమే పిల్లలకు ఇచ్చేలా చూసుకోవాలి.
పిల్లలకు ఐదేళ్ల తరువాత శారీరక వృద్ధి జరుగుతుంది. వారికి అప్పుడే మెదడు పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. అందుకే ఐదేళ్ల నుంచి పిల్లలకు ఊహ తెలుస్తుంది. తమ వాళ్లను గుర్తుపడతారు. ఎందుకంటే ఐదో ఏట నుంచి శారీరక వృద్ధి మొదలవుతుంది కాబట్టి. ఈ పిరియడ్ చాలా ముఖ్యం. తగినంత రక్త సరఫరా జరిగేందుకు ఐరన్ ఉండిన ఆహారం ఇవ్వాలి.
ఇప్పుడు తల్లిదండ్రులు వారి జాబ్స్ లో బిజీ అయిపోయి..న్యాచురల్ హోమ్ మేడ్ ఫుడ్స్ కి బదులు ప్రాసెస్డ్ పదార్థాలైన… బిస్కెట్లు, న్యూడిల్స్, శాండ్ విచ్ లు, పిజ్జాలు అని వాళ్లకు ఇస్తూ ఉంటారు. చూడ్డానికి ఆకర్ణణీయంగా ఉండేసరికి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కానీ వీటివల్ల పిల్లలకు ఫ్యాట్ ఎక్కువ అవుతుంది. దీనివల్ల పేగుసంబంధిత వ్యాధులు వస్తాయి. పిల్లలకు విటమిన్ డి3 చాలా అవసరం. వారి ఆహారంలో సరైన విటమిన్లు ఉండేలా చూసుకోవటం తల్లిదండ్రుల బాధ్యత.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: