బుడుగు: పిల్లలు పరీక్షలా సమయంలో ఇలా చదివించండి..??

N.ANJI
సాధారణంగా పిల్లలు పరీక్షల సమయంలో ఎలా చదవాలో అర్ధం కాక ఒత్తిడికి లోనై అనేక ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు. అయితే పిల్లలు పరీక్షల సమయంలో ఓ ప్లాన్ ప్రకారం చదివితే అలాంటి సమస్యలను దరి చేరకుండా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే విద్యార్ధులు పరీక్షలకు సిద్ధమయ్యేటప్పుడు మూడు సూత్రాలు పాటించాలన్నారు. ఇక అవేమిటంటే... ప్రిపరేషన్‌, ప్లానింగ్‌, పర్‌ఫార్మెన్స్‌ వంటి సూత్రాలను పాటించాలి.
అయితే కొంతమంది ప్రిపరేషన్‌ సమయంలో కష్టపడి చదివే క్రమంలో విపరీతమైన ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఇక ఇందుకు వారిలో పరీక్షల్లో నెగ్గలేమేమోననే భయం, ఆత్మవిశ్వాసం లోపించడం ప్రధాన కారణం అని అంటున్నారు. అంతేకాదు.. పిల్లలు చదివిందే పదే పదే చదువుతూ ఉంటారని అన్నారు
ఇక పరీక్షల వరకూ సమయం పెట్టుకుని, అప్పటిలోగా రివిజన్‌ పూర్తి చేయాలని ధ్యేయంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అయితే తీరా పరీక్షలు దగ్గరకొచ్చేసరికి కొంత పోర్షన్‌ మిగిలిపోతూ ఉంది. అంతేకాక.. అవి అంతకుముందు పట్టు ఉన్న పాఠాలే అయినా, లెక్క ప్రకారం చదవలేకపోయారు కాబట్టి, ఆ పాఠాలు తమకు ఒంటపట్టలేదనే భావనలో ఉంటారు. అయితే అలా ఆందోళనకు లోనవకుండా ఉండాలంటే పరీక్షలకు ఎంతో ముందుగానే ప్రణాళికాబద్ధంగా సిద్ధపడాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అంతేకాదు.. పిల్లలకు చదువుకునే సమయంలో ప్లానింగ్‌ కూడా అవసరం. అయితే కష్టమైన సబ్జెక్టును చివరికి నెట్టేసి, తేలికైన సబ్జెక్టును ముందు చదివేస్తూ ఉంటారు పిల్లలు. ఇక ఇలా చేస్తే కష్టమైన సబ్జెక్టు ఎప్పటికీ కష్టంగానే మిగిలిపోయే ప్రమాదం ఉందని అన్నారు. పిల్లలకు రాని సుబేక్ట్స్ ని ప్రథమ స్థానం కేటాయించి సిద్ధపడాలి. అన్ని సబ్జెక్టులనూ సమమైన ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటే తప్పక మెరుగైన ఫలితం సాధించగలుగుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఎంత చదివిన కొన్నిసార్లు పెర్ఫార్మెన్స్‌ మీదే ఆధారపడి ఉంటుంది. ఇక పరీక్ష హాల్లో అవసరం లేని భయానికీ, ఆందోళనకూ గురైతే, హఠాత్తుగా మతిమరుపునకు లోనయ్యే ప్రమాదం ఉంది. ఇక చదివిన పాఠాలేవీ సమయానికి గుర్తుకురావని అన్నారు. ఇక ప్రశ్నాపత్రంలో తెలియని ఒకటి, రెండు మార్కుల ప్రశ్నలు చూసి ఒత్తిడికి లోనయితే, మిగిలిన 80 మార్కుల ప్రశ్నల జవాబులు రాయలేక గందరగోళానికి లోనవుతుంటారు. ఆలా కాకుండా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: