బుడుగు: పిల్లలు తినకుండా మారం చేస్తున్నారా..?

N.ANJI
చిన్న పిల్లలకు అన్నం తినిపించాలని అంటే పేరెంట్స్ కి తల ప్రాణం తొక్కకి వస్తుంది. ఇక పిల్లలు ఫుడ్ తినడానికి మారం చేస్తారు. కానీ వారు వద్దు అన్నారని అలానే వదిలేస్తే వారికీ కావలసిన పోషకాలు అందవు. పోషకాలు సరిగ్గా అందకపోతే ఎదుగుదల సరిగ్గా ఉండదు. అందుకే పిల్లలకు కష్టమైన కూడా తినిపించాలి. ఇప్పుడు తినిపిస్తేనే పెద్ద అయ్యాక కూడా ఏవ్ అలవాట్లు పాటిస్తారు. కొన్ని టిప్స్ పాటిస్తే పిల్లలకు ఈజీగా తినిపించవచ్చు.
ఇక రోజు ఒకే సమయానికి ఫుడ్ తినిపించాలి. అలా కాకుండా రోజంతా ఏదో ఒకటి తినిపిస్తూ ఉండకూడదు. లంచ్, స్నాక్స్ మధ్యలో పండ్లు కానీ, జ్యుస్ కానీ ఇవ్వవచ్చు. అంతేకాదు ఆకలిగా లేదు అన్నప్పుడు తినిపించకూడదు. బలవంతంగా తినిపించడం కానీ.. తింటే లంచం ఇస్తామని చెప్పడం కానీ చేయకూడదు. ఇలా చేయడం వల్ల వాళ్లకు ఆహారం అంటే వ్యతిరేక భావన ఏర్పడడంతో పాటు ఇంకా లంచం ఇస్తారని తినడం అలవాటు అవుతుంది.
అయితే వాళ్లకు చిన్నప్పుడు నుండే కొత్త కొత్త ఫుడ్స్ అలవాటు చేయడం మంచిది. వాళ్లకు వేరుగా వండడం వంటివి చేయకూడదు. అందరితో కలిసి వాళ్లకు కూడా వండి పెట్టండి. అందరితో పాటు భోజనం చేసే అలవాటు చెయ్యాలి. మీ పిల్లలు మంచిగా తినాలంటే ముందుగా మీరు హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. భోజనం చేసే సమయంలో పిల్లలకు టివి చూసే అలవాటు చేయకూడదు.
కాగా.. పిల్లల్ని తినమని ఎక్కువగా బలవంతం చేయకూడదు. ఏది ఎప్పుడు తినాలో ప్రేమగా చెప్పాలి. అంతేగానీ కోపంగా చెప్పకూడదు. ఒకవేళ అలా చేస్తే వాళ్లలో మొండితనం పెరుగుతుంది. అలాగే వాళ్లు ఏడ్చేటపుడు ఎటువంటి ఆహారపదార్థాలూ తినిపించకూడదు.  రంగురంగుల కూరగాయ, పండ్ల ముక్కలన్ని ఒక ప్లేట్‌లో అలంకరించి వాటి లెక్కబెట్టమనండి. అప్పుడు వాళ్లకు అన్నం తినిపిస్తూ లెక్కలు కూడా నేర్పించొచ్చు. పిల్లల విషయంలో ఓపిక చాలా అవసరం. వాళ్లు అన్నం తినడానికి ఇష్టపనప్పుడు వాళ్లకు ఆకలయ్యేవరకూ చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: