బుడుగు: పిల్లలను నవ్విస్తే ఎంత మంచిదో తెలుసా..!

N.ANJI
చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే ఇల్లు అంత చాలా సందడిగా ఉంటుంది. వాళ్ళ అల్లరితో ఇల్లంతా కోలాహలంగా ఉంటుంది. ఒకోసారి మన ఆటలకి నోరారా నవ్వుతారు. పక పకమని నవ్వేవారి నవ్వు చక్కటి ఆరోగ్యాన్ని అందిస్తుందట. అందుకే వీలయినంత ఎక్కువగా పిల్లల్ని ఆటపాటలతో మురిపించటం ఎంతో మంచిది అంటున్నారు ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ పరిశోధకులు.
ఇక పసి పిల్లల్ని ఎత్తుకుని పైకి ఎగరేస్తూ ఆడటం, అలాగే ఒళ్లో కూర్చో పెట్టుకుని తారంగం తారంగం అంటూ ముందుకీ వెనక్కి ఊపుతూ ఆడించటం, వంటి వన్నీ పిల్లలకి కేవలం ఆటలగా సరదాగా అనిపిస్తాయి. కానీ, నిజానికి  బిడ్డల్ని అలా అటూ, ఇటూ ఊపుతుండటం వాళ్ళ ఎంతో లాభం ఉందని గుర్తించారు పరిశోధకులు.
అయితే వీటివలన వారి మెదడులో గణనీయమైన పెరుగుదల ఉంటుందని గుర్తించారు కూడా. బిడ్డలకు సంగీతాన్ని వినిపిస్తూ ఇలా లయబద్ధంగా ఊపటం వల్ల వారి మెదడులో" సెన్సరీ వ్యవస్థ" చక్కగా బలపడుతోందని, దీనివల్ల నాడీకణాల మధ్య అనుసంధాయక సంబంధాలు అంటే న్యూరాల్ నెట్వర్క్స్ మెరుగై, మెదడు మరింత చురుగ్గా అభివృద్ధి చెందుతోందని పరిశోధకులు గుర్తించారు.
అంతేకాదు.. పసిపిల్లల్ని అడించేటప్పుడు అల్లి బిల్లి పాటలు పాడటం, అందుకు తగ్గట్టు లయాత్మకంగా ఊపటం అన్ని సమాజాలల్లోనూ, అన్ని సంస్కృతుల్లోనూ ఉంది. అలాగే లాలి పాటలు పాడుతూ ఒళ్లో వేసి ఊపుతూ జో కొట్టటం కూడా. వీటి ప్రభావం పిల్లల ఎదుగుదలపై ఎలా ఉంటుందన్న దాని మీద " ఫ్లోరిడా అట్లాంటిక్ యునివర్సిటీ " పరిశోధకులు ఇటీవల విస్తృతంగా పరిశోధనలు
చేశారు. అ పరిశోధనల్లో తెలిసీ, తెలియక మనం ఆడించే ఈ ఆటల వల్ల పిల్లల మెదడుకి ఎంతో మేలు కులుగుతోందని తేలింది.
ఇక చిట్టి పొట్టి గీతాలు, పాటలు పిల్లలకి చిన్నితనం నుంచే వినిపిస్తుండటం వల్ల వారిలో రకరకాల సామర్ధ్యాలు చురుకుగా అభివృద్ధి చెందటం గమనించారు. భాషాపరిజ్ఞానం, జ్ఞాపక శక్తీ వంటివే కాదు పంచేంద్రియాలు అంటే సెన్సస్ చురుకుగా తయారై మెదడు మరింత చురుకుగా వృద్ధి చెందుతుందని వీరు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: