బుడుగు: చిన్నపిల్లలు ఊరికే దగ్గతున్నారా..? ఇలా చేయండి..!?

N.ANJI

చిన్న వయసులో పిల్లలు సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో దగ్గు కూడా ఒకటి. దగ్గులో కూడా చాలా రకాలు ఉంటాయి. అయితే ఏ రకం దగ్గో తెలుసుకుని వైద్యం చేయించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. పిల్లల ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉందొద్దని, దగ్గుకు గల కారణాలు తెలుసుకుని చికిత్స చేయించాలని అంటున్నారు. తగిన జాగ్రత్తలు, మందులు వాడటం వల్ల దగ్గును నియంత్రించవచ్చని వారు చెబుతున్నారు. అయితే దగ్గు తగ్గడానికి కొన్ని సూచనలు పాటించడం.. మందులు వాడటం వల్ల బాగా పనిచేస్తాయి.



దగ్గు తగ్గాలంటే పాటించాల్సిన నియమాలు..

దగ్గుతో బాధపడుతున్న చిన్న పిల్లలకు త్వరగా జీర్ణమయ్యే తేలికపాటి ఆహారాన్ని అందించాలి. ఎక్కువగా ద్రవ పదార్థాలతో కూడిన పౌష్టికాహారాన్ని అందజేయాలి. ఒకేసారి అధిక మోతాదులో ఆహారం ఇస్తే వాంతి వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒకేసారి ఆహారం తినిపించకుండా తక్కువ మోతాదులో ఆహారం ఇస్తుండాలి. అలాగే ఆకలి వేసినప్పుడు తినిపిస్తుండాలి. కొద్దికొద్దిగా ఆహారం తినిపిస్తూ శరీరంలో ఇమ్యూనిటీని పెంచాలి.



దగ్గు వచ్చినప్పుడు జలుబు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఆ సమయంలో ఆవిరి పట్టడం వల్ల దగ్గు, జలుబు నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఇందుకు ఆవిరి యంత్రాలు వాడినా బాగుంటుంది. ఆవిరి పట్టిన 20 నిమిషాల్లో ఉపశమనం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఆవిరి యంత్రాన్ని ఉపయోగించే ముందు దాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. అప్పుడే బ్యాక్టీరియా, ఫంగన్ వ్యాప్తించి కొత్త ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అలాగే వత్తిలాగా చేసిన దూదితో ముక్కను శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల గాలి పీల్చడం తేలికవుతుంది. దగ్గు, జలుబు క్లియర్ అయితే ఎలాంటి సమస్య ఉండదు. ఫలితంగా రాత్రి మంచిగా నిద్రపోవచ్చు.



అలాగే చిన్నపిల్లలు పడుకోబెట్టినప్పుడు తలకింద చిన్న మెత్త పెట్టుకోవాలి. అప్పుడే శ్వాస బాగా ఆడుతుంది. నోట్లో వేళ్లు పెట్టి శ్లేష్మాన్ని తీయడానికి ప్రయత్నించాలి. దీని వల్ల ఒక్కోసారి శ్వాస ఆగిపోయే ప్రమాదం ఉంది. పెద్దవాళ్లు దగ్గినప్పుడు ముక్కుకు రమాలు లేదా మాస్కు పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. ముక్కును తుడిచిన ప్రతిసారీ చేతులను శుభ్రం చేసుకోవాలి. పిల్లలకు దగ్గు, జలుబు వచ్చినప్పుడు తల్లితో వేరే గదిలో పడుకోబెట్టాలి. ఇంట్లో ఇతరులకు వైరస్ సోకకుండా ఉంటుంది. దగ్గు, జలుబుతో బాధపడేటప్పుడు రోజూ పరిగడపున వేడి నీళ్లు తాగించాలి. అప్పుడు గొంతులో ఉండే బ్యాక్టీరియా నశిస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: