బుడుగు: పిల్లలు పక్క తడుపుతున్నారా.. ఇలా చేయండి..!

N.ANJI
చాల మంది పిల్లలకు నిద్ర పక్క తడిపే అలవాటు ఉంటుంది. ఇక చిన్న పిల్లలు ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఈ సమస్య నుంచి బయట పడడం చాలా అవసరం. చాలా మంది పిల్లలు ఈ సమస్య తో ఇబ్బంది పడుతూ ఉంటారు. దీని కోసం నిపుణులు మనకి పలు విషయాలు చెప్పారు. మరి వాటిని కూడా మీరు గమనించి ఇప్పుడే పరిష్కారం వెతుక్కోండి. చేసిన పరిశోధన ప్రకారం కొన్ని విషయాలను మనకి పొందుపరిచారు. వాటిని చూస్తే ఈ సమస్య కోసం మీకు పూర్తిగా అర్థం అయి పోతుంది.
ఇక నిద్రలో తెలియకుండా చిన్న పిల్లలు మంచాన్ని తడిపేస్తూ వుంటారు. ఇది చాలా మందిలో సహజం. అయితే వాళ్లు ఎదిగే కొద్దీ సమస్య తొలగి పోతుందని గమనించడం చాలా ముఖ్యం. అయితే స్టడీస్ ప్రకారం 40 శాతం మూడేళ్ల పిల్లలు పక్క తడుపుతూ ఉంటారు. మూడేళ్లు దాటిన వాళ్లకి క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. అయితే ఈ విషయం పై చాలా మంది నిపుణులు సందేహంలో పడ్డారు. అయితే ఎందుకు చాలా మంది పిల్లలు రాత్రి నిద్ర పోయిన తర్వాత పక్కని ఎందుకు తడుపుతారు అనేది అర్థం కాలేదు. అయితే వాళ్ళల్లో యూరినరీ బ్లాడర్ సరిగ్గా అభివృద్ధి అవ్వక పోవడమే ఈ సమస్య వస్తుందని నమ్ముతుంటారు.
అయితే అధిక మొత్తంలో యూరిన్ ని వాళ్ళు స్టార్ చేసుకో లేక పోవడం లేదా జన్యు పరంగా కూడా ఈ సమస్య వస్తుంది అని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది పిల్లల్లో వాళ్లకి బాగా దగ్గరగా వుండే ఫ్యామిలీ మెంబర్ వలన కూడా ఈ సమస్య రావచ్చు అని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి కేవలం ఒకే ఒక కారణం వల్ల ఇలాంటివి రావు. ఏదైనా సమస్య కి కారణం అవ్వచ్చు. ఇది ఇలా ఉండగా చాలా మంది పిల్లలు బ్లాడర్ ఫుల్ అయ్యింది అని గమనించరు. దీని కారణంగా కూడా వాళ్ళు మంచాన్ని తడిపేస్తారు. అలానే మీ పిల్లలకి కనక యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంటే వాళ్ళు యూరిన్ ని కంట్రోల్ చేసుకోలేరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: