బుడుగు: పోషకాహారం తగ్గితే పిల్లలకు వచ్చే జబ్బులు ఇవే..!?

N.ANJI
చిన్న పిల్లలు త్వరగా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. సరైన పోషకాలు ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, అమైనో ఆమ్లాలు, కొవ్వు పదార్థాలు తక్కువైతే వచ్చే సమస్యనే పోషకాహార లోపం వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పోషకాహారం లోపిస్తే వ్యాధి  నిరోధక శక్తి తక్కువగా ఉండటమే కాకుండా ఇక్కడ చెప్పుకునే జబ్బులు వస్తాయి.
సరైన పోషక ఆహారాన్ని ముఖ్యంగా ప్రోటీన్స్ తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వలన చిన్న పిల్లలో జుట్టు రాలడం,  పెదవులు పగలడం వంటి సమస్యలు చాలా ఇబ్బందికి గురి చేస్తాయి. దీనినే వైద్యభాషలో మెరాస్ మస్ అని అంటారు. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే కండరాలు తగ్గిపోవడం, నీరసంగా ఉండటం, ఆకలిగా ఉన్నా ఏది తినలేకపోవడం, వయస్సుకు తగ్గ ఎత్తు, బరువు లేకపోవటం.
ఈ వ్యాధి లక్షణాలు పిల్లలలో ఎలా ఉంటాయంటే అదే బరువు కలిగి ఉండటం, చర్మంపై పగుళ్లు, పొక్కులుగా రాలటం, నీరసంగా ఉండటం,జుట్టు రంగులో మార్పు, కాళ్ళు వాపులుగా ఉండటం జరుగుతుంది.పోషకాహారం లోపించడం వలన ఇతర పిల్లల్తో పోలిస్తే చలాకీగా ఉండలేకపోవడం, తినే తిండిపై, ఆడుకునే ఆటలపై ఆసక్తి చూపించలేక పోవడమే కాకుండా భవిష్యత్ లో కాకుండా మరిన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
గర్భధారణ సమయంలో సరైన పోషక ఆహారం తీసుకోవడం, బిడ్డకు జన్మను ఇచ్చిన తర్వాత 6 నెలల వరకు తప్పకుండా తల్లి పాలు ఇవ్వడం, అలాగే 6 నెలల తర్వాత ఘన ఆహార పదార్థాలు అలవాటు చేయడం, సరైన సమయానికి సరైన టీకాలు వేయించడం, పండ్ల పదార్థాలు, ద్రవ పదార్థాలు ఇవ్వడం చేయాలి.
పిల్లలు ఆరోగ్యంగా ఎదగడానికి, వారి ఎముకలు బలంగా ఉండటానికి కాల్షియం ఫుడ్స్ ఎక్కువగా ఇవ్వాలి. చిన్నతనంలోనే కాల్షియం ఫుడ్ ఎక్కువగా ఉండటం వలన గుండె సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తులు, మెదడుకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఎదిగే పిల్లలకు మొక్కజొన్నలను కాల్చి తినిపించడం వలన వారి దంతాలు మరింత దృఢంగా ఉంటాయి. ఒకవేళ పిల్లలకు కడుపునొప్పిగా ఉంటే ఉడికించిన మొక్కజొన్నలు పెట్టాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: