బుడుగు: పసి పిల్లలు ఎక్కువగా ఎందుకు ఏడుస్తారో తెలుసా..!?

N.ANJI
చిన్న పిల్లలు ఎందుకు ఏడుస్తారో ఎవరికీ అర్ధం కాదు. అయితే కొన్ని సందర్భాలలో పిల్లలు ఏడవడం మంచిదే అని వైద్యులు చెబుతుంటారు. అయితే కొన్నిసార్లు పసిపిల్లలు గంటల తరబడి ఆపకుండా ఏడుస్తుంటారు. అలాంటి సమయాలలో ఏం చేయాలో దిక్కుతోచక తల్లిదండ్రులు సతమతమవుతూ ఉంటారు. ఈ విధంగా పిల్లలు ఏడవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని చైల్డ్ సైకియాట్రిస్ట్ నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే చిన్న పిల్లలు ఏడవడానికి గల కారణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
ఇక పసి పిల్లలు ఏడుపు ఒక భాష అని నిపుణులు వెల్లడించారు. అంతేకాక వారు ఏడవడం ద్వారా వారికి ఏమి అవసరమో దానిని తల్లిదండ్రులకు తెలియజేస్తూ ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే పిల్లలకు ఆకలిగా ఉన్నప్పుడు ఏడుపు ఆపకుండా నిరంతరం గట్టిగా అరుస్తూనే ఉంటారు. అలాంటి సమయంలో తల్లి వారిని చేరదీసి కొని వారి ఆకలి తీర్చాలి. అంతేకాకుండా ఎంతో బిగ్గరగా ఉలిక్కి పడే విధంగా ఏడుస్తుంటారు. అలాంటి సమయంలో వారికి చెవి నొప్పి లేదా కడుపు నొప్పి, కావచ్చని పరిశోధకులు తెలుపుతున్నారు.అలాంటి సమయంలో వారిని వెంటనే చిన్న పిల్లల వైద్యుల దగ్గరికి తీసుకువెళ్లాలి.
అయితే కొంతమంది పిల్లలు తమ తల్లి తన దగ్గరకు రావాలని భావించి మధ్య మధ్యలో ఉ..ఊ అంటూ ఏడుస్తుంటారు. ఈ విధంగా ఏడుస్తున్న పిల్లలను తల్లిదండ్రులు గమనించి వెంటనే చేర తీయకూడదని వైద్యులు చెబుతున్నారు. ఇక ఇదే అదునుగా చేసుకొని పిల్లలు నిద్ర పోకుండా ఎప్పుడు తల్లివద్ద ఉండటానికి ఇష్టపడుతుంటారు. ఈ విధంగా వారి ఏడుపును బట్టి తల్లిదండ్రులు స్పందించాలి. వారు ఎందుకు ఏడుస్తున్నారో తెలియకపోతే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. కొంతమంది పిల్లలు ఎప్పుడు నిద్ర పోకుండా రాత్రి పగలు అనే తేడా లేకుండా ఏడుస్తూ ఉంటారు. అలాంటి పిల్లలను వెంటనే వైద్యుని దగ్గరకు తీసుకెళ్ళి చూపించాలని పరిశోధకులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: