బుడుగు : పిల్లలు ఉన్న ఇంట్లో పెంపుడు జంతువులను పెంచితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. !!

Suma Kallamadi

ఈరోజుల్లో చాలామంది ఇళ్లల్లో పెంపుడు జంతువులను పెంచుకోవడం అలవాటు అయిపొయింది. కుక్క, పిల్లి, ఉడత, కుందేలు, మేక , అలాగే కొన్ని పక్షులు వంటి పెంపుడు జంతువులను ప్రస్తుతం చాలామంది తమ ఇళ్లలో తమ ఇంటి సభ్యులులాగా చూసుకుంటూ ప్రేమగా పెంచుకుంటున్నారు. అయితే ఇలా పెంపుడు జంతువులు మీతో పాటు పెంచుకోవాలనుకున్నప్పుడు మీరు పిల్లల విషయంలో  చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.అవేంటో చుడండి.  పెంపుడు జంతువులను సరిగ్గా పెంచుకునే అవగాహన లేకపోతే చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.పెంపుడు జంతువులను ఇంట్లోకి  తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు ముందుగా వాటి ఆహార అలవాట్లు ఎలా ఉంటాయి. ఎప్పుడు ఏ సమయానికి ఎటువంటి ఫుడ్ ఇవ్వాలి, వాటిని మీతో హ్యాపీగా ఉండేలా ఎలా మచ్చిక చేసుకోవాలి అనేవి తెలియాలి.

 

 

 

 

అలాగే  పెంపుడు జంతువుల వద్ద క్రిములు ఎక్కువగా చేరుతుంటాయి కాబట్టి ఇంట్లో అప్పుడే పుట్టిన పిల్లలు, చిన్న పిల్లలకు కాస్త దూరంగా ఉంచడం మంచిది. ఎందుకంటే వాటి నుండి క్రిములు చిన్నపిల్లలకు చేరే అవకాశం లేకపోలేదు. మీ పిల్లలకు అలర్జీ, చర్మ సమస్యలు ఉంటే వారి దగ్గరకు వెళ్లనివ్వకండి. పిల్లలకు పెంపుడు జంతువుల పట్ల భయం ఉంటే వారిని దగ్గరకు రా, వీటితో ఆడుకో అంటూ బలవంతం చేయకూడదు. వారికీ ఇష్టంగా ఉంటేనే వాటితో స్నేహం చేయించాలి. కొన్ని పెంపుడు జంతువులకు కొన్ని నెలలకు లేదా సంవత్సరానికి ఒకసారి టీకాలు, వ్యాక్సిన్ వంటివి అవసరం కాబట్టి వాటి గురించి ముందే తెలుసుకోవాలి. అలాగే పెంపుడు జంతువులకు ఆహారం పెట్టె పాత్రలు లేదా గిన్నెలు వేరుగా ఉంచాలి.

 

 

 

 

 

 

పిల్లలు పెంపుడు జంతువుల దగ్గరకు వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఒక్కోసారి అవి కరుస్తాయి కూడా. కుక్క కరిస్తే చాలా డేంజర్.. రేబిస్ లాంటి ప్రమాద కరమైన జబ్బులు వస్తాయి.. అందుకని ముందుగానే కుక్కలకు వాక్సిన్ వేయించడం మంచిది. పసిపిల్లలు ఒంటరిగా నిద్రిస్తున్న చోటు పెంపుడు జంతువులను ఉంచకూడదు. ఎందుకంటే సూక్ష్మక్రిములు వీటి నుంచి వారికి త్వరగా వ్యాపించి అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం లేకపోలేదు. పెట్స్ ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలపై అవి ఎక్కువ ప్రేమను చూపిస్తూ, వారితో ఉండటానికి ఇష్టపడుతూ ఉంటాయి. అందుకని పిల్లలకు పెంపుడు జంతువులను ఎలా గౌరవించాలో నేర్పించాలి. పిల్లలు భయంగా పెట్స్ ను దూరం పెట్టినట్లయితే వాటి గోర్లతో పిల్లలపై దాడి చేస్తాయి. ఇవి కొన్నిసార్లు ప్రమాదానికి దారి తీయవచ్చు.  క్లీన్ గా ఉండేలా ఎప్పుడు ఎలా స్నానం చేయించాలో ముందే తెలుసుకోవాలి.వాటి జుట్టు ఇంట్లో పడకుండా జాగ్రత్తగా ఉంచాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: