బుడుగు: మీ పిల్లల్ని ఎప్పుడన్నా ఇలాంటి ప్రశ్నలు అడిగారా.. ?

Suma Kallamadi

ఒక  బిడ్డకు జన్మనిచ్చాక ఇంకా ఆ తల్లితండ్రులుకి పిల్లలే ప్రపంచం.వాళ్ళ చిలిపి చేష్టలను చూసి, వాళ్ళ నవ్వులు, అల్లరి చూసి మురిసిపోతుంటారు. పిల్లలంటే అంత ప్రేమ, ఇష్టం మరి తల్లితండ్రులకు. అయితే పిల్లలు ఎదుగుతున్నప్పుడు తల్లి తండ్రులు ఇలాంటి ప్రశ్నలు అడగటం వలన పిల్లలు మన గూర్చి ఏమి అముకుంటున్నారు, వాళ్ళకి నచ్చేది ఏంటి నచ్చనిది ఏంటి అనే కొన్ని ప్రశ్నలకు జవాబు దొరుకుతుంది. ఇంతకీ తల్లితండ్రులు పిల్లలను అడగవలసిన ఆ ప్రశ్నలేంటో మీరే చూడండి.ముందుగా పిల్లలకు ఏది ఇష్టమో, ఏది అయిష్టమో మీకన్నా బాగా మరెవరికీ తెలియదు కానీ ఒక్కసారి వారికి ఇష్టమైనది ఏంటి, ఇష్టం కానివి ఏంటో అడగటం వలన మీతో ప్రతి విషయాన్ని దాచుకోకుండా స్నేహపూర్వకంగా చెబుతారు.ఎక్కువగా  పిల్లలకు ఆడుకునే వస్తువులు, తినే పదార్థాలు అంటే  ఇష్టం ఉంటుంది. అవి కాకుండా ఇంకా ఏమంటే ఇష్టమో కనుక్కోవాలి.

 

 

అలాగే కొన్ని సార్లు పిల్లలు ఏమీ లేకుండానే భయ పడటం, స్కూల్ కు వెళ్ళమన్నప్పుడు లేదా ఎవరి దగ్గరికైనా వెళ్ళమన్నప్పుడు మారాం చేస్తూ భయపడుతూ ఉంటారు.వాళ్ళ దగ్గరకు వెళ్ళను అని మారం చేస్తూ ఉంటారు. అందుకని వారికి ఉన్న భయం ఏంటి, ఎందుకు భయమో అడిగి తెలుసుకోవడం వలన వారిలో ధైర్యాన్ని నింపిన వారవుతారు.ఇప్పుడు సర్ది చెప్పకపోతే పెద్ద అయ్యాక కూడా భయపడుతూనే ఉంటారు.అలాగే ప్రతి ఇంట్లో  పిల్లలని అడిగే ప్రశ్న ఇది.. నీకు అమ్మంటే ఇష్టమా, నాన్నంటే ఇష్టమా? అని అలాగే  ఎందుకు ఇష్టం, అమ్మానాన్నలలో నీకు నచ్చిన విషయాలు ఏంటో చెప్పు అని పిల్లలను అడిగితే తప్పకుండా తడబడకుండా చెబుతారు. కావాలంటే అడిగి చూడండి.పిల్లలు చెప్పే సమాధానం బట్టి మనం కూడా వాళ్లకు నచ్చినట్లు ఉండాలి. 

 

 


చిన్నప్పటి నుండీ ప్రతి ఒక్కరికీ కొన్ని బలాలు బలహీనతలు ఉంటాయి. మీరు పక్కనే ఉంటే పిల్లలకు కొండంత అండగా, ధైర్యంగా ఉంటుంది. అది వారికి బలం. అదే మీరు పక్కన లేకపోతే ఏమీ చేయలేరు, ఏ నిర్ణయం తీసుకోలేరు. అదే బలహీనత. అందుకే ముందు నుంచి పిల్లల్ని దైర్యంగా పెంచండి. అలాగే నువ్వు పెద్దయ్యాక ఏం కావాలని అనుకుంటున్నావ్ అని అడగటం వలన వారికి భవిష్యత్ పై ఇష్టం పెరుగుతుంది. వారికి తెలియకుండా ఒక లక్ష్యాన్ని ఏర్పరచినవారవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: